నిజామాబాద్(ద్రోణ ప్రతినిధి):-
తెలంగాణ ప్రాంతీయ ఉపాధ్యాయ సంఘం, టిపియూఎస్ ఆధ్వర్యంలో ప్రగతి నగర్ పాటిదార్ భావన్ లో నిర్వహించిన ఉపాధ్యాయ వందన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పట్ల శాసనస మండలిలో ప్రశ్నించే గొంతుకగా మొదటి ప్రాధాన్యతతో కొమురయ్య ని గెలిపించిన ఘనత ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి దక్కుతుందన్నారు. మేధావులైన ఉపాధ్యాయులు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంప పెట్టు లాంటిది అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీలు, హామీలు తుంగలో తొక్కి మాటలతో పూట గడుపుతున్న రేవంత్ సర్కార్ కు తగిన గుణపాఠం జరిగిందన్నారు. ఎమ్మెల్సి ఎన్నికల గెలుపే రేపు తెలంగాణలో బిజెపి ప్రభుత్వం ఏర్పడటానికి పునాది అవుతుందన్నారు. ఈ విజయంలో కష్టపడ్డా టి పి యు ఎస్ సంఘ నాయకులకు, బిజెపి కాషాయ కార్యకర్తలకు, ఉపాధ్యాయులకు మేధావులందరికి పాదాభివందనం తెలియజేసారు. ఈ సందర్బంగా ఎన్నికలలో కష్టపడి పని చేసి బిజెపిని గెలుపు దిశగా నడిపించిన ఉపాధ్యాయులను ఎమ్మెల్యే సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, టి పి యూ ఎస్ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి కృష్ణవేణి, కొండా ఆశన్న, రెంజర్ల నరేష్,తదితరులు పాల్గొన్నారు.
