Friday, February 13, 2026

మహిళలపై జరుగుతున్న హత్యలు

హత్యాచారాలపై కఠిన చట్టాలను రూపొందించాలి

మహిళలు అన్ని రంగాలలో ఎదగాలి

జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి.పద్మావతి


నిజామాబాద్ ( ద్రోణ) ప్రతినిధి :-అఖిల భారత ప్రజాతంత్ర మహిళ సంఘం, ఐద్వా ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ క్లబ్ లో ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పి. పద్మావతి మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాలలో ఎదుగుతున్నారని, అదేవిధంగా ఐద్వా మహిళా సంఘం పోరాటాలే కాకుండా మహిళలను చైతన్య పరచడంలో ముందుంటుందని అభినందించారు. మహిళాలకు ఉన్న సమస్యలను జిల్లా న్యాయ సలహా సంస్థలకు తెలియజేస్తే వారి సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తామని అన్నారు. మహిళలు చదువుల్లోనే కాకుండా పోరాటాలలో ముందుండాలని తెలిపారు. గైనకాలజిస్ట్ డాక్టర్ బండారి సుజాత మాట్లాడుతూ మహిళలు స్వశక్తిగా ఎదగాలని మరియు సొంత నిర్ణయాలు తీసుకునే విధంగా ఉండాలని హితవు పలికారు. టెక్నాలజీని అందుపుచ్చుకొని మహిళా హక్కులను తెలుసుకొని ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. తల్లిదండ్రులు ఆడ మగ అనే భేదం లేకుండా పిల్లల్ని సమానంగా చూసినప్పుడే ఈ సమాజం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని అన్నారు.
ఉమెన్ వెల్ఫేర్ చైల్డ్ ఆఫీసర్ రసూల్ బి మాట్లాడుతూ మహిళల పై దాడులు జరిగితే సఖి సెంటర్ల ద్వారా, అంగన్వాడీల ద్వారా సమాచారం అందించాలని అన్నారు. మహిళలకు సమస్యలు వస్తే ఈ టోల్ ఫ్రీ నంబర్లకు చైల్డ్ హెల్ప్ లైన్ 1098, సఖి హెల్ప్ లైన్ 181 సమాచారం అందిస్తే పరిష్కారానికి కృషి చేస్తామని, అదేవిధంగా ఐద్వా ఇలాంటి సెమినార్లు అనేకంగా నిర్వహించి మహిళలలో చైతన్యం నింపాలని కోరారు. ఇంటర్నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ స్విమ్మర్ పూర్ణ ఆకాశంలో సగం అమ్మలో, సగంగా మహిళలు అన్ని రంగాలలో ముందుంటున్నారని వారందరూ ఐక్యంగా వారి సమస్యలపై పోరాటాలు చేయాలని సూచించారు. అదేవిధంగా మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులతో పాటుగా మహిళా జర్నలిస్టులను, ఆర్టిజన్, అంగన్వాడీలను ఆశలను సన్మానించడం జరిగింది. మహిళ పోరాట యోధురాల్ల చరిత్రను తెలపడం కోసం రమాబాయి, సావిత్రిబాయి పూలే, ఝాన్సీ లక్ష్మీబాయి, చిన్నారుల వేషధారణతో పాటుగా ఆటపాటలతో పీఎన్ఎం జిల్లా కార్యదర్శి సిర్ప లింగం బృందం ఆకట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్షురాలు అనిత , స్వర్ణలత రేణుకా,కలా, రేఖ, శ్రీదేవి, విమల, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular