ధర్పల్లి (ద్రోణ) :-మండలం కేంద్రంతోపాటు దుబ్బాక గ్రామంలో యాసంగి లో ఎండిపోయిన పంట పొలాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, జిల్లా వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. వ్యవసాయ అధికారి ని ఎండిపోయిన పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉంటూ, ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కలెక్టర్, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారి సుమారు 200 ఎకరాల వరకు ఎండిపోయినట్లు తెలిపారు. ఆయకట్టు, బావుల పరిధిలో ఎన్ని హెక్టార్లు సాగు చేశారని ఏవోను కలెక్టర్ వివరాలు అడిగారు. భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోతున్నాయని కలెక్టర్ కు రైతులు నివేదించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, శ్రీనివాసరావు, వెంకటేష్, తాసిల్దార్ మాలతి తదితరులు ఉన్నారు..
ధర్పల్లి మండలంలో ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్
RELATED ARTICLES
