Friday, February 13, 2026

రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు

మీ సమస్యను ప్రభుత్వం గుర్తించింది సానుకూలంగా స్పందిస్తుంది

జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు,రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి


నిజామాబాద్ ప్రతి నిధి (ద్రోణ):- జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నుడా చైర్మన్ కేశ వేణు విలేకరుల సమావేశం నిర్వహించారు. సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా శ్రమించిన ఓడిపోవడం నిరాశ పరిచిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు, ఉపాధ్యాయులకు సిఎం అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఈ ఎన్నికల్లో ఓడిపోవడం నిరాశకు గురి చేసింది అని,అంతేకాకుండా దశాబ్దాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించిన వారు ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులను మోసం చేశారని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 56 వేల ఉద్యోగాలు ఇచ్చిన పట్టబద్రులు ఎందుకు ఓటు వేయలేరో, అనేది అర్థం కావడం లేదు అని, కొంతకాలంగా ఉపాధ్యాయులకు ప్రమోషన్లు,బదిలీలు లేక ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత వారు ప్రమోషాన్లు ఇచ్చిందని అయిన కూడా ఎన్నికల్లో ఓటు వేయకపోవడం కొంత నిరాశ పరిచ్చిందని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపై జిల్లా కాంగ్రెస్ నాయకులందరూ కలిసి సమీక్ష నిర్వహిస్తామని,రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అని, ఇంకా ఎక్కువగా కష్టపడి స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు వైపు ముందడుగు వేస్తామని తెలిపారు.గత మూడు నాలుగు రోజులుగా జిల్లాలో పసుపు ధర గురించి రైతులు ఆందోళన చెందుతున్నరని,పసుపు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని,
పసుపు కొనుగోళ్లకు ప్రత్యేక అదికారిని నియమించాలని కలెక్టర్ కి తెలపడం జరిగిందని, ప్రత్యేక అదికారిని నియమించి రైతులకు న్యాయం చేస్తామని ,రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఎంపి అరవింద్ పసుపు బోర్డ్ ను తెచ్చనని గొప్పలు చెప్పుకుంటున్నాడని, నిజామాబాద్ లో పసుపు పండిస్తే ,బోర్డ్ ను ఢిల్లీలో పెట్టడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే పసుపు బోర్డ్ ను నిజామాబాద్ లో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాకు చెందిన వారే పసుపు బోర్డ్ చైర్మన్ గా వున్న పసుపు రైతులను మోసం చేస్తున్నారని, పసుపు రైతులకు అన్యాయం జరుగుతుంటే
అరవింద్ ఎక్కడ మొహం పెట్టుకుంటాడో చెప్పవలసిన అవసరం వుంది అని మానాల మోహన్ రెడ్డి అన్నారు.
రైతు ఎండిన పసుపును మార్కెట్ యార్డుకు తీసుకుని రావాలని, అదేవిధంగా మద్దతు ధర వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గత సంవత్సరం పసుపు ధర పెరిగితే అది కేంద్ర ప్రభుత్వం పసుపు ఎగుమతులు చేయడం ద్వారానే పెరిగింది అని చెప్పిన అరవింద్ ఇప్పుడు పసుపు ధర తగ్గిన క్రమంలో ఎందుకు మాట్లాడటం లేదు అని అన్నారు. పసుపు ధర ఎందుకు తగ్గిందో చెప్పాల్సిన బాధ్యత జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పైన స్థానిక ఎంపీ అరవింద్ పైన ఉంది అని మానాల మోహన్ రెడ్డి అన్నారు. పసుపు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని రాష్ట్ర ప్రభుత్వం పసుపు రైతుల సమస్యలు తీర్చే విధంగా ప్రాణాలిక రూపొందిస్తుంది అని కేంద్ర ప్రభుత్వంపై పసుపు రైతుల సమస్యల గురించి ఎల్లప్పుడూ పోరాడుతూనే ఉంటామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రత్నాకర్, జిల్లా ఓబీసీ అధ్యక్షులు నరేందర్ గౌడ్,సేవాదళ్ అధ్యక్షులు సంతోష్, మాజీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు గోపి,రాష్ట్ర ఎన్ ఎస్ యు ఐ ప్రధాన కార్యదర్శి వేణు రాజ్,బింగి శుభం,సాయి కిరణ్,కౌశిక్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular