నిజామాబాద్ టౌన్ ప్రతినిధి ద్రోణ:-
మద్యం సేవించి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడ్డ 17 మందిపై కోర్టు తీర్పు ఖరారు చేసింది. ట్రాఫిక్ ఏసీపీ టీ. నారాయణ, ఇన్‌స్పెక్టర్ పి. ప్రసాద్ నేతృత్వంలో డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారిని బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించి సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ నూర్ జాన్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం 13 మందికి రూ. 14,500/- జరిమానా విధించగా, నలుగురికి రెండు రోజుల జైలు శిక్ష విధించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటుండటంతో ప్రయాణికులు, మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
