Friday, February 13, 2026

ఘనంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు

తెలంగాణ జాగృతి సీనియర్ నాయకులు పర్వతనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు సైకిళ్ల పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ ద్రోణ:-

కార్యకర్తల ఆనందోత్సహాలు, కోలాహలం నడుమ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పడానికి గురువారం నాడు ఉదయం పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు, తెలంగాణ జాగృతి శ్రేణులు, అభిమానులు ఆమె నివాసానికి తరలివచ్చారు.

ఉదయం నంది నగర్ నివాసంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశిస్సులు తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్న ఎమ్మెల్సీ కవితకు డప్పు చప్పులు, గజమాలతో కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలందరినీ కలుసుకున్న ఎమ్మెల్సీ కవిత… ప్రతి ఒక్కరిని పేరుపేరున పలకరించారు. తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మరోవైపు, ఎమ్మెల్సీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని జాగృతి సీనియర్ నాయకులు పర్వతనేని శ్రీధర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు సైకిళ్ల పంపిణీ జరిగింది. ఎమ్మెల్సీ కవిత చేతుల మీదుగా శ్రీధర్ రావు సైకిళ్లను పంపిణీ చేయించారు. అదే విధంగా వికలాంగుడికి ట్రై స్కూటీ కూడా పంపిణీ చేయడం జరిగింది. బిఆర్ఎస్ పార్టీ బీసీ నాయకులు బొల్ల శివ శంకర్ ఆధ్వరంలో బీసీ కుల సంఘాల నేతలు ఎమ్మెల్సీ కవిత ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు

కాగా, తన నివాసంలో వేడుకుల తర్వాత శాసన మండలికి వెళ్లగా… అక్కడ బీఆర్ఎస్ పార్టీ శాసన మండలి పక్షం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు మధుసూధనా చారి ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా, శాసనసభలో బీఆర్ఎస్ పార్టీ శాసనసభా పక్ష కార్యాలయంలోనూ కేక్ కట్ చేయించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్, మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, సబితా ఇంద్రా రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, ఎంఎల్సీ సత్యవతి రాథోడ్, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే, బీఆర్ఎస్ పార్టీ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎంఎల్సీ నవీన్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే ముఠా గోపాల్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్ధన్, కరీంనగర్ మాజీ జెడ్పీ చైర్ పర్సన్ తుల ఉమా, సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ చైర్మన్లు దేవి ప్రసాద్ , అయాచితం శ్రీధర్, రాజీవ్ సాగర్ , దూదిమెట్ల బాల్ రాజ్, రామ్ చందర్ నాయక్ , వెంకటేశ్వర్ రెడ్డి, రజిని సాయి చంద్ , గెల్లు శ్రీను, మఠం భిక్షపతి, గజ్జెల నగేష్, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్ర తనోభ, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, శుభప్రద పటేల్ , ఇంతియాజ్ ఇషాక్ , నిజామాబాద్ మాజీ డీసీఎంఎస్ చైర్మన్ మోహన్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అయేషా ఫాతిమా, విజిత్ రావు, అభిలాష్ రావు, రూప్ సింగ్, రామ్ బాబు యాదవ్ , హమాలీ శ్రీను, మారయ్య, జాగృతి నాయకులు మరియు శ్రేణులు ఎమ్మెల్సీ కవిత నివాసానికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

వినూత్న రీతిలో కార్యకర్తలు, అభిమానుల ఆధ్వర్యంలో వేడుకలు

బీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ జాగృతి కార్యకర్తలు వినూత్న రీతిలో ఎమ్మెల్సీ కవిత జన్మదిన వేడుకలను నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. శేరిలింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత రవీందర్ యాదవ్ ఒడిశాలోని పూరీలో సముద్ర తీరంలో ఎమ్మెల్సీ కవిత సైకత శిల్పాన్ని ఏర్పాటు చేశారు. జన్మదినం సందర్భంగా ఒడిశా కళాకారుల నృత్యాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయి. పూరీ సముద్రం చెంద రూపుదిద్దిన సైకత శిల్పం చూపరులను ఆకట్టుకుంటుంది. సైకత శిల్పంలో “కవిత ది ఫేస్ బిహైండ్ బతుకమ్మ గ్లోబల్ రీచ్” అని అందులో పేర్కొన్నారు. కళాకారులతో కలిసి కేక్ కట్ చేసి ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలను తెలిపారు.

ఎమ్మెల్సీ కవితపై చిన్నూ గౌడ్, మట్టా చౌదరి లఘు చిత్రం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చిన్నూ గౌడ్, మట్టు చౌదరి రూపొందించిన ప్రత్యేక లఘు చిత్రం అందర్నీ ఆకట్టుకుంటోంది. నాలుగు నిమిషాల నిడివి గల ఈ లఘు చిత్రం దక్షిణ కన్నడ జిల్లాలో చిత్రీకరించారు. అక్కడ పారే సెలయేరులు, నదుల్లో పడవలపై విన్యాసాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. “హ్యాపీ బర్త్డే కవితక్క” అని పేర్కొని బీఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాలను ఆహ్లాదకరమైనటువంటి ప్రకృతి రమణీయ ప్రాంతాల్లో రెపరెపలాడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular