Tuesday, March 31, 2026

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి

కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

నిజామాబాద్ (ద్రోణ ):-

ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు త్వరతగతిన నిర్మాణాలు చేపట్టేలా ప్రోత్సహించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభించిన వారు నిర్దేశిత గడువులోపు, నిబంధనలకు అనుగుణంగా నాణ్యతతో నిర్మాణ పనులు పూర్తి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులు చేపట్టిన ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ మంగళవారం క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలన జరిపారు. గ్రామంలో ఎన్ని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని కలెక్టర్ ఆరా తీశారు. మొత్తం 125 మందికి మంజూరు కాగా, వారిలో 25 మంది ఇళ్ల నిర్మాణాలను చేపట్టారని అధికారులు తెలిపారు. మిగితా లబ్ధిదారులు కూడా సత్వరమే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. గ్రామ సభల ద్వారా అర్హులైన వారిని లబ్ధిదారులు గుర్తిస్తూ, ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. లబ్ధిదారులు అందరూ సకాలంలో నిర్మాణ పనులు చేపట్టి ఇళ్లను నిర్మించుకునేలా తోడ్పాటును అందించాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ వెంట గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular