కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు ఉచిత వైద్య సేవలు
నిజామాబాద్ (ద్రోణ):- ప్రభుత్వం, రెడ్ క్రాస్ సంస్ధల సంయుక్త ఆధ్వర్యంలో వృద్ధుల కోసం డిచ్పల్లి మండలం రాంపూర్ లో వృద్ధాశ్రమం అందుబాటులోకి తేవడం జరిగిందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. జిల్లాలో ఎక్కడైనా అనాథ వృద్ధులను గమనిస్తే రాంపూర్ లో నూతనంగా ప్రారంభించబడిన వృద్ధాశ్రమంలో చేర్పించాలని సూచించారు. ఆధార్ కార్డు, రెండు పాస్పోర్ట్ సైజు ఫోటోలు, అందుబాటులో ఉంటే ఆరోగ్య సంబంధిత ఫైల్,
సంబంధిత గ్రామపంచాయతీ నుండి అనాధ వృద్ధులే అని ధ్రువీకరణ పత్రము, వృద్ధులను వృద్ధాశ్రమంలో చేర్పించే వారి పూర్తి వివరాలు, మొబైల్ నెంబర్ తో దరఖాస్తు చేయవచ్చని అన్నారు. వృద్ధాశ్రమంలో చేరే వారు 60 సంవత్సరాలు పైబడి, స్వస్థత తో ఉండి వారి పనులు వారు చేసుకునే విధంగా ఉండాలన్నారు.
పై వివరములతో జిల్లా వృద్ధుల, శిశు సంక్షేమ అధికారి గారి కార్యాలయం లో గాని ,రెడ్ క్రాస్ సొసైటీ కార్యాలయం, ఖలీల్ వాడి లో లేదా రాంపూర్ లోని ఓల్డ్ ఏజ్ హోమ్ ను సంప్రదించి వృద్ధులను ఆశ్రమంలో చేర్పించవచ్చని అన్నారు.
రెడ్ క్రాస్ చైర్మన్ 9849933300,రెడ్ క్రాస్ పి ఆర్ ఓ 8688887004,

ఓల్డ్ ఏజ్ హోమ్ కో ఆర్డినేటర్ 9618844461లను సంప్ర దించవచ్చని వివరించారు.ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నిజామాబాదు శాఖ భవనంలో తలసీమియా వ్యాధి రక్త మార్పిడి కి రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా రక్త మార్పిడి చేయబడుతుందని, ఉచితంగా మందులు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఐదు సంవత్సరాల వయసు దాటిన తలసేమియా బాధితులు ఉచిత వైద్య సేవలు పొందేందుకు రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరి అన్నారు. ఐదేళ్ల లోపు బాలలకు సంబంధించి వాళ్ళ పేరెంట్స్ రేషన్ కార్డు, ఆధార్ కార్డు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఒక రోజు ముందు ఫోన్ చేసి బుకింగ్ చేసుకోవాలనీ, ప్రస్తుతం మంగళ, గురు, శనివారాల్లో రక్త మార్పిడి ఉంటుందని సూచించారు. బాధితుల సంఖ్య పెరిగినప్పుడు ప్రతిరోజు ఉండే అవకాశం ఉంటుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని స్వచ్చంద సంస్థలు ముందుకు వచ్చి స్వచ్చంద రక్త దాన శిబిరాలు విరివిగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
