Friday, February 13, 2026

ఖైదీలకు టీబీ పరీక్షలు

అవగాహన సదస్సు

నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:–

సారంగాపూర్ జిల్లా జైలులో గల ఖైదీలకు (టిబి) అవగాహన జాగ్రత్తల గురించి తెలిపారు. హె. చ్. ఐ. వి, పాటిటీస్ బి పరీక్షలు నిర్వహించారు. జిల్లా జైల్ సూరిండెంట్ ఆనంద్ రావు సందర్బంగా అయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరు టిబి లక్షణాలు, సోకకుండా చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని జాగ్రత్తలు గురించి ఖైదీలకు వివరించడం జరిగింది. 430 ఖైదీలకు టిబి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని అందులో 27 ఖైదీల తెమడా నమూనాలను సేకరించారు. రేపటిలోగా వివరాలు వస్తాయని అన్నారు. ఎవరికైనా మేము చెప్పినటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే జైలర్ కి చెప్పి పరీక్షలు చేయించుకోవాలని జాగ్రత్తగా ఉండకూడదని అన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా టిబి నియంత్రణ అధికారి డాక్టర్ దేవి నాగేశ్వరి,జైలర్ రాజశేఖర్ రెడ్డి, జైల్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ దినేష్, జిల్లా టిబి సమన్వయ కర్త రవిగౌడ్, డి. పి. యం. సుధాకర్,సాతి (ఎన్ జి ఓ) వినోద్, మహేష్, జైల్ ఫార్మసిస్ట్ రాంచందర్, టిబి సూపెర్వైసోర్ స్రవంతి, మరియు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular