ప్రజలకు న్యాయం ఎక్కడ
ప్రజాప్రతినిధులపై బురద జల్లే అధికారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది! ఇసుక మాఫియా vs న్యాయమైన నాయకత్వం – బోధన్‌లో ఉద్రిక్తత!
అధికారం మదమెత్తిన ఆర్ఐ గంగాధర్ – ప్రజా ఉద్యమమే శరణు?
ప్రజాస్వామ్య విలువలపైనా దెబ్బ!
. అవినీతి ఆరోపణలతో అడ్డంగా దొరికిన ఆర్ఐ గంగాధర్ – ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారు?
ఇసుక మాఫియాతో గ్యాంగ్ టీమ్‌గా మారిన ఓ ప్రభుత్వ అధికారి
బోధన్ టౌన్ ప్రతినిధి (ద్రోణ):-
బోధన్ నియోజకవర్గ మచ్చలేని ఎమ్మెల్యే మరియు ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రతినిధులను అవమానించడం, ఇసుక మాఫియాతో చేతులు కలిపి వసూళ్లు చేయడం వంటి ఆరోపణలు నియోజకవర్గంలో సంచలనం రేపుతున్నాయి. ఆర్ఐ గంగాధర్ తన హోదాను ఉపయోగించుకొని, ప్రభుత్వానికి ప్రామాణికంగా పని చేసే ఒక మచ్చలేని ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఇసుక మాఫియాతో ఫోన్ సంభాషణలు లీక్ అవడం, మీడియా ప్రతినిధులను కూడా అవమానించడంతో ప్రజలల్లో ఆగ్రహం మరింత పెరిగింది. ఒక వైపు ప్రజా సేవ చేస్తానని ప్రమాణం చేసిన అధికారులకు, మరోవైపు ఇసుక మాఫియాతో చేతులు కలిపి చేసుకునే వారికీ మధ్య వ్యత్యాసం ఏమిటి?
ఇది మొదటిసారి కాకుండా, ఇటువంటి వారిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో కొందరు పై రాజకీయ ఒత్తిళ్లు లాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. ప్రజలు మరియు రాజకీయ కార్యకర్తలు ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుబడుతూ, ప్రభుత్వానికి న్యాయమైన శిక్షను అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇసుక మాఫియా అక్రమాలకు అండగా నిలిచే అధికారులకు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం వచ్చిందా? ఇప్పుడు చూస్తే, ప్రజల తీర్పు ఏంటో తెలియాల్సి ఉంది. ఇకపై ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు తీసుకునే చర్యలు ఏంటో వేచి చూడాలి.ఇటీవలి కాలంలో బోధన్ నియోజకవర్గంలో ఇసుక మాఫియా కార్యకలాపాలు మరియు అధికారులపై అవినీతి ఆరోపణలు సంబంధించి వివిధ సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఆరోపణలు ప్రజల్లో ఆగ్రహాన్ని రేకెత్తించాయి.
ముఖ్యాంశాలు:-

ఇసుక మాఫియా ఫోన్ సంభాషణల లీక్‌లు: ఇసుక మాఫియాతో సంబంధిత ఫోన్ సంభాషణలు లీక్ కావడం, అధికారులపై అవినీతి ఆరోపణలను బలపరిచింది. ప్రమాణ స్వీకారం వాస్తవం:- ప్రజా సేవ చేయాలని ప్రమాణం చేసిన అధికారులు, ఇసుక మాఫియాతో చేతులు కలిపి లాభదోపాలు చేసుకోవడం ప్రజాస్వామ్యంలో నైతికతపై ప్రశ్నలు రేకెత్తిస్తుంది.
పైన అధికారుల నిర్లక్ష్యం:-

ఇటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడంలో పై అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ ఒత్తిళ్లు ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. బోధన్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు, అవినీతిని అరికట్టేందుకు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తక్షణమే కఠిన చర్యలు అవసరమని సూచిస్తున్నాయి.
