ఎడపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన సిపి
ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి
శుక్రవారం సాయంత్రం నిజామాబాద్ పోలీస్ కమీషనర్ సాయి చైతన్య ఎడ పల్లి పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనికీ చేపట్టారు.పోలీస్ స్టేషన్ మొత్తం కలియతిరిగి పోలీస్ స్టేషన్ పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు.రిసిప్షన్ సెంటర్ పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకు న్నారు.
5S విధానం అమలు చేస్తున్నారా లేదా అడిగి తెలుసుకొని పరిశీలించారు.
వాహనాల పార్కింగ్ చూసారు.రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు.
గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిస ఐతే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు. నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.
సైబర్ మోసగాండ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు
గెమింగ్ యాప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలని అన్నారు.
సిబ్బoది సాధక బాధలు ప్రతీ ఒక్కరిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా బోధన్ ACP శ్రీనివాస్, బోధన్ రూరల్ CI విజయ్ బాబు , ఎడ్ పల్లి ఎస్.ఐ వంశీ కృష్ణ లు పాల్గొన్నారు.











