నిజామాబాద్ ప్రతినిధి (ద్రోణ):-
నిజామాబాద్ జిల్లాలో టీబి ముక్త్ నిర్వహించడం జరిగింది. జిల్లాలో 545 గ్రామ పంచాయతీ లలో 11 గ్రామ పంచాయతీలు క్షయ రహిత గ్రామాలను ఎంపిక చేశారు. ఈ సందర్బంగా జిల్లా పంచాయితీ అధికారి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ ఈ 11 గ్రామపంచాయతీ లే కాకుండా జిల్లాలోని పలు వార్డులను కూడా టిబి ని నిర్ములించే దిశలో పని చేస్తున్నామని త్వరలోనే జిల్లాలో క్షయ రహిత జిల్లా గా మారాబోతుందని తన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. జిల్లాలోని పలు గ్రామ కార్యదర్శులకు టిబి లక్షణాలు, జాగ్రత్తలు, నివారణ చర్యలు వంటి అంశాల పైన మానవతా సదన్ ప్రాంగణం లో టిబి కోఆర్డినేటర్ రవి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది.

ఎంపిక కాబడిన క్షయ రహిత గ్రామాలు ఇవే :-
పడ్కల్, లక్ష్మపూర్, పాల్ద, ముల్లంగి బి, గంగర్ మంద, పోతునర్, తాళ్ల రామడుగు, అబ్బపూర్ యం, సుంకేట్, వాడ్యాట్ మరియు మల్కాపూర్ తాండ ఉన్నాయి.


ఈ కార్యక్రమం లో డిప్యూటీ డి.యం.అండ్ హెచ్.ఓ. తుకారాం రాథోడ్ జిల్లా టిబి కో ఆర్డినేటర్ రవిగౌడ్, నవీపేట్ ఎంపీఓ రామకృష్ణ, ధర్పల్లి ఎంపీవో రాజేష్, ముగపాల్ ఎంపీవో కిరణ్, ఇందల్వాయి ఎంపీవో రాజఖాన్, సిరికొండ ఎంపీవో తార చంద్ మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.
