ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి:-
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లా క్షయ నియంత్రణ విభాగం ద్వారా జిల్లాలో ప్రపంచ క్షయ నిర్మూలన దినోత్సవ ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమాల్ని స్థానిక నిజామాబాద్ పట్టణంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా నిర్వహించినటువంటి ర్యాలీని అడిషనల్ కలెక్టర్ రెవిన్యూ కిరణ్ కుమార్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు .


ఈ ర్యాలీ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నుండి బస్టాండ్ మీదుగా న్యూ అంబేద్కర్ భవన్ కు చేరుకుంది. ఈ ర్యాలీలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు తిరుమల నర్సింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది, డిప్యూటీ డిఎంహెచ్వోలు, వైద్యాధికారులు మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం న్యూ అంబేద్కర్ భవన్ లో టిబి స్టాల్,కళాజాత మరియు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి,

జిల్లా టిబి అధికారి డాక్టర్ దేవినాగేశ్వరి టిబి కార్యక్రమం గురించి సంక్షిప్త వివరణ ఇవ్వడం జరిగింది అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా హాజరైనటువంటి జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి రాజశ్రీ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రైవేట్, స్వచ్చంద సంస్థలు మరియు ప్రజలందరి భాగస్వామ్యం తో మాత్రమే జిల్లా నుండి క్షయ ను నిర్ములించవచ్చు , క్షయ వ్యాధి పట్ల నింద,వివక్షత చూపించకూడదు అని అన్నారు, మందులు క్రమం తప్పకుండా వాడాలి లేని పక్షం లో అది తిరగబడి మందులకు లొంగని టిబి గా మారి ప్రాణంతకంగా మరి అవకాశం ఉంది కావున టిబి రోగులు పూర్తి కాలం చికిత్స తీసుకోవాలని సూచించారు. టిబి పరీక్షలు, మందులు పూర్తిగా ఉచితంగా లభిస్తాయి కావున ప్రజలు ఈ అవకాశాలను వినియోగించుకోవాలి సూచించారు. చికిత్స తీసుకున్నంత కాలము పౌష్టికహర నిమిత్తము రోగి ఖాతా లో నెల నెల 1000/- నేరుగా జమ చేయడం జరుగుతుంది అని ఈ సందర్బంగా తెలిపారు.

భవిష్యత్తులో నిజామాబాద్ జిల్లాను క్షయ రహిత జిల్లాగా మార్చాలని దానికోసం మీరంతా నిరంతరం కృషి చేయాలని సిబ్బంది కి సూచించారు.

ఈ కార్యక్రమంలో టిబి సూర్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో న్యూట్రిషన్ కిట్స్ ని టీబీ వ్యాధిగ్రస్తులకు పంపిణీ చేయడం జరిగింది . అదేవిధంగా జిల్లాలో గతంలో టీబీ వ్యాధికి గురై టీబీ చికిత్సను విజయవంతంగా పూర్తి చేసి టిబి రహిత వ్యక్తిగా మారినటువంటి టీబి చాంపియన్స్ గా మారిన వారిని ఈ సందర్భంగా సన్మానించడం జరిగింది.

ఈ కార్యక్రమం లో డి.ఐ.వో. డాII అశోక్, ఇండియన్ రెడీక్రాస్ సొసైటీ డివిజన్ చైర్మెన్ డాక్టర్ శ్రీశైలం, పల్మనాలజీ డిపార్ట్మెంట్ డాక్టర్ ఉమర్,టిబి మెడికల్ ఆఫీసర్ అవంతి,హెల్త్ ఎడ్యుకేటర్ ఘనపూర్ వెంకటేష్,టిబి కోఆర్డినేటర్ రవి, ఆకాశవాణి కోఆర్డినేటర్ మోహన్ దాస్ మరియు స్వచ్చంద సంస్థలు పాల్గొన్నారు.
