Friday, February 13, 2026

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం

మూడో మహాసభల జయప్రదంకై

ప్రచార జాత ప్రారంభం

ద్రోణ నిజామాబాద్:-

స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో గల సిపిఐ పార్టీ కార్యాలయం ఆవరణలో నిజామాబాద్ జిల్లాలో ఈనెల 25,26,27 తేదీల్లో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మూడో మహాసభలను జయప్రదంలో భాగంగా జిల్లాలో రైతులలో, ప్రజల లో చైతన్య ప్రచారం చేయడానికి , ప్రచార జాతను సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాజిరెడ్డిలు జెండా ఊపి ప్రారంభించడం జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజామాబాదులో గోనే రెడ్డి ఫంక్షన్ హాల్ లో రేపు రైతు సంఘం రాష్ట్ర మహాసభల ప్రారంభ సూచికంగా బహిరంగ సభ నిర్వహిస్తున్నామని ఈ బహిరంగ సభలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మాట్లాడటానికి సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జాతీయ, రాష్ట్ర నాయకులు నాయకులు పాల్గొంటారని ఈ సభకు జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నామన్నారు.
ప్రధానంగా ఈ మహాసభలలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలపై చర్చ తో పాటు జిల్లాకు సంబంధించిన చెరుకు పరిశ్రమలు పసుపు, ఎర్ర జొన్న,వరి,తదితర పంటల రైతుల సమస్యలపై ప్రధానమైన చర్చ ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వై.ఓమయ్య, నాయకులు రాధాకుమార్, మహేష్, కోయేడి నర్సింలు,శ్రీరాములు గౌడ్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular