నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం మందర్న గ్రామ శివారు అక్రమ ఇసుక తవ్వకాలు –
అధికారుల మౌనంతో ప్రజలకు నష్టం!

ఓవర్‌లోడ్ ఇసుక టిప్పర్లతో రోడ్లు ధ్వంసం
రైతుల పంటలకు నష్టం భూ జలాలు అంతరిస్తున్నాయి
అధికారుల ప్రణాళికా లోపం – ఇసుక దోపిడీపై తక్షణ చర్యలు తీసుకోవాలి
అక్రమ ఇసుక తవ్వకాలపై ఎమ్మార్పీఎస్ నాయకుల వినతి
ద్రోణ బోధన్::-
నిజామాబాద్ జిల్లా సాలూరా మండలం మందర్న గ్రామంలో అనుమతిని మించి జరుగుతున్న ఇసుక తవ్వకాలపై ఎమ్మార్పీఎస్ నాయకులు బోధన్ సబ్ కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.

వినతి పత్రం అందజేసిన వారు:-
సోంపూర్ పోచిరాం – జిల్లా కార్యదర్శి, ఎమ్మార్పీఎస్
పోతంగల్ సాయినాథ్ – మండల అధ్యక్షుడు, ఎమ్మార్పీఎస్
తాడెం అబ్బాయా – బోధన్ టౌన్ ప్రెసిడెంట్, ఎమ్మార్పీఎస్
భూరేశంకర్ – మండల అధ్యక్షుడు, ఎమ్మార్పీఎస్
ఇసుక అక్రమ తవ్వకాల వల్ల కలుగుతున్న నష్టం:-

అనుమతి లేకుండా ఇసుకను భారీ స్థాయిలో తవ్వడం వల్ల సహజ వనరులు దెబ్బతింటున్నాయి. ఓవర్‌లోడ్ టిప్పర్లు రోడ్లపై ప్రయాణించడంతో రహదారులు పాడవుతున్నాయి. దుమ్ము, ధూళి వ్యాప్తి వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. ప్రజలు పలు మార్లు మైనింగ్ మరియు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

సబ్ కలెక్టర్ హామీ:-
బోధన్ సబ్ కలెక్టర్ వినతి పత్రాన్ని స్వీకరించి, పరిస్థితిని స్వయంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సాలూరాలో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎమ్మార్పీఎస్ పోరాటం ఇసుక దందాకు అడ్డుకట్ట వేయాలని సబ్ కలెక్టర్‌కు వినతి

ప్రజల ఆక్రోశం – అధికారుల నిర్లక్ష్యం
ఓవర్‌లోడ్ టిప్పర్లు – పాడవుతున్న రహదారులు
అక్రమ తవ్వకాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి – ఎమ్మార్పీఎస్ డిమాండ్

షోకాష్ నోటీసులు జారీ చేసిన బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో గత కొన్ని రోజులుగా, బోధన్ పట్టణంలో ఇసుక అక్రమ రవాణా ఘటనపై రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) గంగాధర్‌కు సంబంధించిన ఆడియో టేప్ వైరల్ అయింది. ఈ ఆడియోలు ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి చర్చలు ఉన్నట్లు తెలుస్తోంది. దీని ఫలితంగా, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ఆర్‌ఐ గంగాధర్‌కు షోకాజ్ నోటీసు జారీ చేశారు.
