ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ
ఏప్రిల్ 8వ తారీఖున జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నాలు
ద్రోణ నిజామాబాద్ టౌన్ ప్రతినిధి:-
తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం తృతీయ మహాసభలు మార్చి 25, 26, 27 తేదీలలో నిజామాబాద్ జిల్లాలో విజయవంతంగా ముగిసాయి. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కార్యక్రమాల రిపోర్టును ప్రవేశపెట్టారు. ఈ రిపోర్టుపై 32 మంది చర్చలలో పాల్గొన్నారు. నివేదిక ఏకగ్రీవంగా ఆమోదించబడింది.14 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించి 109 మందితో రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేసి అధ్యక్షా ప్రధాన కార్యదర్శి తో పాటు 21 మంది రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ గా ఎన్నుకోబడ్డారు . అధ్యక్షులుగా భాగం హేమంత రావు, ప్రధాన కార్యదర్శిగా పశ్యపద్మ తిరిగి ఎన్నిక కావడం. ఉపాధ్యక్షులుగా ఉజ్జిని యాదగిరిరావు, కంజర భూమయ్య, కొప్పోజు సూర్యనారాయణ, కొల్లూరు రాజయ్య, దొండపాటి రమేశ్,వి. ఎస్ ప్రసాద్ శాస్త్రి, ప్రభు లింగం, నెట్టెం నారాయణ, మిడకంటి వెంకట్ రెడ్డి, బొల్లు ప్రసాద్ ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శులుగా వర్ల వెంకటయ్య, కంబాల శ్రీనివాస్ , చంద్ర నరేంద్ర కుమార్ , చిలక దేవి దాస్ , దేవ భక్తుని సంద్య , కోశాధికారిగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిల్లోఎన్నికల సందర్భంగా రాష్ట్ర పాలకులు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేయటానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయాల ముందు ఏప్రిల్ 8వ తారీఖున ధర్నాలు నిర్వహించాలి. అని పిలుపునివ్వడం జరిగింది. మహాసభ ఆమోదించిన తీర్మానాలు
హైదారాబాద్ చుట్టూ ప్రక్కల గ్రామాల్లో 111 జీఓని ఎత్తి వేయాలని తీర్మానించారు. డాక్టర్ స్వామినాధన్ కమిషన్ సిఫార్సులకు చట్టబద్ధత చేయాలని, కౌలు రైతులకు రైతు భరోసా, గుర్తింపై కార్డులు ఇవ్వాలని, దేవాదుల ప్రాజెక్ట్ ద్వారా ములుగు జిల్లాలోని అన్ని గ్రామాలకు సాగునీరు కల్పించాలని, రాష్ట్రంలోని, పోడు భూములకు, సాదా బైనామా దరఖాస్తు దారులకు పట్టాలు ఇవ్వాలని, పంటలకు పంటల బీమా పథకం ఏర్పాటు చేసి, రైతులు పండించిన పంటల నిల్వకు గోదాములు నియమించాలని, మహబూబాబాద్ జిల్లాలో ఎర్రచందనం మార్కెట్ సౌకర్యం కల్పించాలి. ములుగు జిల్లాలో నకిలీ విత్తవాలు, జన్యు మార్చిడి విత్తనాలు వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, రైతులకు ప్రభుత్వం నష్ట పరిహారం కల్పించాలని, రైతు పండంచిన వరి ధాన్యాన్ని
మార్కెట్ లో అమ్మడం కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని
ధాన్యం ఉత్పత్తి దారుల సంఘం ను రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు చేయాలని, బైంసా మండలం రంగారావు ప్రాజెక్ట్ ద్వారా గూడెం గ్రామంలో 450 కుటుంబాలు ముంపుకు గురువుతున్నారు వారికి నష్ట పరిహరం అందించాలని, జనగారం జిల్లాలో సనాబుపేట రిజర్వాయర్ ద్వార యాదాద్రి జిల్లా గుట్ట గంధమల్ల రిజర్వాయర్ లో పనులు పూర్తి చేయాలని, సాగు నీరు అందించాలని, ఎస్ ఎల్ బి సి (SLBC) సొరగం పూర్తి చేయాలి. బ్రహ్మం వెల్లెల్లి ప్రాజెక్టును కృష్ణ పురం వరకు కాల్వలు ఏర్పాటు చేయాలి. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలి. యాదాద్రి పవర్ ప్లాంట్ భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. వాజేడు మండలంలో రైతులకు సమ్మక్క సారక్క బ్యారేజీ ద్వారా సాగునీరు అందించాలి.

మహిళా రైతులకు పాడి పరిశ్రమ, కోళ్ల పరిశ్రమ పట్టు పరిశ్రమ పుట్టగొడుగుల పరిశ్రమ వీటికి 90% సబ్సిడీ ఇచ్చి మహిళా రైతులను ప్రోత్సహించాలని ఈ మహాసభ తీర్మానించారు.
55 సంవత్సరాలు నిండిన రైతులకు 10.000 రూపాయల పెన్షన్ అందించి, ఆరోగ్య కార్డులు ఇవ్వాలని, ఎకరానికి రెండు లక్షల పంట రుణం ఇవ్వాలని తీర్మానాలు చేయడం జరిగింది.
.
