పోలీస్ స్టేషన్లను పరిశీలించిన సిపి
ద్రోణ నిజామాబాద్ ప్రతినిధి
గంజాయి నిర్మూలనకు ఉక్కుపాదం మోపాలని నిజామాబాద్ సిపి సాయి చైతన్య పోలీసులను ఆదేశించారు. గంజాయి అమ్మకాలు చేపట్టిన, లేదా వారికి ఎటువంటి సంబంధాలు ఉన్నా వారు ఎంతటి వారైనాప్పటికీ సహించేది లేదని హెచ్చరించారు. యువతకు అవగాహన కల్పించడంతోపాటు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయాలని సిపి స్పష్టం చేశారు.
శనివారం రుద్రూర్, కోటగిరి వర్ని పోలీస్ స్టేషనులను సిపి పర్యవేక్షించారు.పోలీస్ స్టేషన్ల ఆవరణలను క్షుణ్ణంగా పరిశీలించారు.రిసిప్షన్ సెంటర్ల పనితీరును , కంప్యూటర్ సిబ్బంది పనితీరును క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.
5S విధానం అమలు చేస్తున్నారా లేదా అని వాకప్ చేశారు.వాహనాల పార్కింగ్ చూసారు.రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. ప్రధానంగా ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనాదారులకు జరుగుతున్నందున, తప్పనిసరి హెల్మేట్ ధరించి ప్రయాణం చేయాలని సూచించారు.గంజాయి నిర్మూలనకు అధికారులకు ఆదేశాలు జారీచేయడం జరిగిందని, ఎవరయిన గంజాయికి బానిస అయితే వారికి కౌన్సిలింగ్ చేయాలని తెలిపారు , దాని నిర్మూలనకు పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.సైబర్ మోసగాండ్ల నుండి ప్రజలు మోసపోకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు గెమింగ్ అప్ ల పట్ల ప్రజలు మోసపోకుండా ఎప్పటికప్పుడు వారికీ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిoచాలని అన్నారు.
సిబ్బoది సాధక బాధలు తెలుసుకున్నారు.ఈ సందర్బంగా బోధన్ ఏ సి పి శ్రీనివాస్ , రుద్రూర్ సబ్ ఇన్స్పెక్టర్ సాయన్న , వర్ని ఎస్సై మహేష్ , సిబ్బంది మరియు పోలీస్ స్టేషన్ల సిబ్బంది పాల్గొన్నారు.


