పోచారం పిలుపు
ద్రోణ బాన్సువాడ ప్రతినిధి
బాన్సువాడ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 24వ తేదీన జరగనున్న శ్రీ రామ్ నారాయణఖేడ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల ఏర్పాట్లను వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
1994వ సంవత్సరంలో నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు, నాయకుల కోరిక మేరకు ఈ ప్రాంతంలో డిగ్రీ కళాశాల తీసుకురావాలని, అప్పుడు ఉన్న ఉమ్మడి జిల్లాలో నిజామాబాద్, కామారెడ్డిలో మాత్రమే రెండు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి, ఈ ప్రాంతంలో డిగ్రీ కాలేజీ అవసరముందని అప్పటి సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఒక సంవత్సరం పాటు కష్టపడితే 17/10/1997 లో కాలేజీ శాంక్షన్ జీవో ఇచ్చారు, 28 ఆగస్టు 1998 లో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా కాలేజీని ప్రారంభించుకున్నాం అని పోచారం స్పష్టం చేశారు.కాలేజీ జీవో వచ్చిన తర్వాత స్థలం కోసం చూస్తుండగా అప్పట్లో ఈ స్థలంలో శ్రీ రామ్ నారాయణ కేడియా ఫ్యాక్టరీ ఉండేది కాలేజీ గురించి వారికి తెలవగానే వారి ఫ్యాక్టరీ స్థలం సుమారుగా 12 ఎకరాల స్థలాన్ని ఉచితంగా విరాళంగా ఇచ్చారు అందుకే ఈ కాలేజీకి ఆయన పేరు శ్రీ రామ్ నారాయణ ఖెడియా ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ అని పెట్టుకున్నాం అని పోచారం స్పష్టం చేశారు.
ఈ కాలేజీ స్థాపింపబడినప్పటి నుండి ఈ కాలేజీలో పనిచేసిన అధ్యాపకులు గాని ప్రిన్సిపాల్స్ గాని చాలా పట్టుదలతో పని చేశారు. వారిని అభినందించారు.
ఈ కాలేజీలో 42 మంది టీచింగ్ స్టాఫ్, 19 మంది నాన్ టీచింగ్ స్టాఫ్, మూడు కంప్యూటర్ ల్యాబ్స్, 12 సైన్స్ ల్యాబ్స్, 52 క్లాస్ రూమ్ లతో అన్ని హంగులతో కొనసాగుతుంది.ఈ కాలేజీ ఏర్పాటు చేసిన సంకల్పం ఏమిటంటే ఈ ప్రాంత పేద మరియు మధ్య తరగతి కుటుంబాల కోసం ఏర్పాటు చేసుకున్నాం.ఈ కాలేజీ ఏర్పాటు చేసిన నుండి గత సంవత్సరం వరకు 13,050 మంది పట్టభద్రులు అవుతే అందులో సుమారు పదివేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు, మిగతా మూడు వేల మంది ప్రైవేట్ రంగాలలో రాణిస్తున్నారు.కాలేజీ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఇప్పటితో ఆగకుండా గోల్డెన్ జూబ్లీ, ప్లాటినం జూబ్లీ, డైమండ్ జూబ్లీలతో కొనసాగాలని ఈ పరంపర భవిష్యత్తులో ఉండే నాయకులు,అధ్యాపకులు, విద్యార్థులు కష్టపడి శ్రమించి ఈ కాలేజీ పేరును ఇంకా అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను.ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఎల్లుండి అనగా 24 ఉదయం 10:00 నుండి ప్రారంభించుకొని మధ్యాహ్నం వరకు భోజనం అనంతరం కార్యక్రమం ముగింపబడుతుంది.
ముఖ్యంగా ఈ సిల్వర్ జూబ్లీ వేడుకలు ఈ కాలేజీలో విద్యను అభ్యసించి వివిధ రంగాల్లో స్థిరపడిన పూర్వ విద్యార్థుల కోసం కావున మీరు ఎక్కడున్నా తప్పకుండా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ వేడుకలను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.
కాలేజీకి ఇంత మంచి పేరు, ప్రతిష్ట వచ్చిందంటే అది కేవలం మీ మేధస్సు మీ క్రమశిక్షణ అధ్యాపకులు చెప్పింది అమలు చేయడం వల్లె మీరు ఉన్నత స్థాయిలో ఉన్నారు, మీ అనుభవాలను ఇప్పటి విద్యార్థులతో పంచుకొని ఈ వేడుకలను విజయవంతం చేయవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, కళాశాల అధ్యాపక బృందం ఉన్నారు.







