Friday, February 13, 2026

రుద్రూర్ పీఎస్ కానిస్టేబుల్ పై సస్పెన్షన్ వేటు

ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానని రెండు లక్షలు వసూలు

అధిక వడ్డీ వ్యాపారుడిగా పేరుసస్పెండ్ చేసిన జిల్లా సీపీ సాయి చైతన్య.

ద్రోణ నిజాంబాద్ ప్రతినిధి

రుద్రూర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పని చేస్తున్న సిద్ధిరాం చిన్నయ్య ను సస్పెండ్ చేస్తూ నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయి చైతన్య శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లాలో 24 గంటల్లో మరో కానిస్టేబుల్ పై వేటుపడడం పోలీసు శాఖలో కలకలం రేపింది. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం తెంబుర్తి గ్రామానికి చెందిన రావుల నాగభూషణం అనే వ్యక్తికి ఆర్మీలో ఉద్యోగం ఇప్పిస్తానని కానిస్టేబుల్ చిన్నయ్య రూ. 2లక్షలు తీసుకున్నాడు. ఇప్పటికీ ఎలాంటి ఉద్యోగం ఇప్పించకపోవడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు జిల్లా కేంద్రంలోని ఒకటవ టౌన్ లో కేసు నమోదయింది. అదేవిధంగా నిర్మల్ ఖానాపూర్ ప్రాంతాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. ఇతరులకు అప్పులు ఇచ్చి 10% కన్నా ఎక్కువ వడ్డీని వసూలు చేసినట్లు ఆరోపణలు రావడంతో విచారణ జరిపించి చిన్నయ్య పై సస్పెన్షన్ వేటు వేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular