Friday, February 13, 2026

భూమి కోసం భుక్తి కోసం పోరాటాలు చేసిన జిల్లా అదిలాబాద్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ

ద్రోణ అదిలాబాద్ జిల్లా: మే05

ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కు ప్రత్యేక చరిత్ర ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కారీ అన్నారు. భూమికోసం భుక్తి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆదివాసుల జిల్లా ఇది అని కొనియాడారు కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ లో సభ వేదికపై నుంచి జాతీయ రహదారులను ఆయన ప్రారంభించారు.

పీఎం సడక్ యోజన కింద దేశవ్యాప్తంగా రోడ్లు నిర్మిస్తుందని ఆయన అన్నారు. రహదారులు మెరుగ్గా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అందరికీ నమస్కారం.. బాగున్నారా.. అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు.

నితిన్ గడ్కరీ మాట్లాడు తూ. పండిట్ దీన్ దయాళ్ గారి సామాజిక చింతన మాకు ఆదర్శం.. మీ జిల్లాకు రావడం చాలా ఆనందంగా ఉంది నాకు మీ సమస్యలు వినే అవకాశం కలిగింది.. ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ దీపం వెలిగించాలి.. గడ్చిరోలి జిల్లాలో ఒకప్పటి పరిస్థితి వేరు కానీ ఇపుడు పరిస్ధి తులు మారుతున్నాయి..

పేదవారికి కూడు, గూడు, గుడ్డ అవసరం మేము దానికోసం పని చేస్తాం.. ప్రతి యువకుడు ఉపాధి పొందాలి.. నేను అగ్రికల్చర్ సైన్సులో పని చేసినందుకు 13 డాక్టరేట్ పొందాను.. ఏ ఊరిలో అయితే బావిలో ఒక గంట నీరు వచ్చేదో అదే ఊరిలో ఇపుడు 12 గంటలు నీరు సరఫరా అవుతుంది.. డబ్బులు డిపాజిట్ చేసినట్టు నీరు కూడా డిపాజిట్ చేయవచ్చు..

వాటర్ స్టోరేజ్ సామర్థ్యం పెంచడానికి డ్యాంలలో పూడిక తీశాం.. నేషనల్ హైవే అథారిటీ తరఫున రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశించ కుండా బావుల్లో, చెరువుల్లో పూడిక తీయడానికి మేము సిద్ధంగా ఉన్నాం..

దీని వల్ల రైతులకు లాభం చేకూరుతుంది. నీటి కోసం రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి.. నేను ముంబాయిలో మంత్రిగా ఉన్న కాలంలో వాజ్ పెయి గారి ఆదేశంతో గ్రామాలకు కనెక్టివిటీ చేసే కార్యక్రమం నా వయస్సు 33 ఏళ్ళు ఉన్నప్పుడు చేపట్టాను.. ఇదే ఇప్పటి ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన.. తెలంగాణలో రహదారులు బాగు చేసి, ప్రజలకు సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నాం..

నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొత్తలో 2,511 కిలో మీటర్ ఉండగా ఇపుడు దాదాపు 5000 కిలోమీటర్లు పెంచాం.. తెలంగాణలో ఇంకా 2లక్షల కోట్ల రూపాయల పనులు చేపడతాం.. ఇది ట్రైలర్ మాత్రమే పిక్చర్ ఇంకా మిగిలి ఉంది.

తెలంగాణ ఆదివాసీ జిల్లాలైన ములుగు , అదిలాబాద్ జిల్లాలకు కూడా వెళ్లేందుకు జాతీయ రహదారుల కనెక్టివిటీ కలుపుతాం.. రాష్ట్ర అభివృ ద్ధికి నీరు, ట్రాన్స్పోర్ట్, విద్యు త్, చాలా అవసరం అవి ఉంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి.. 17 వేల కోట్ల ఖర్చుతో లక్ష కోట్లతో గ్రీన్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణం చేస్తున్నాం.. 4500 కోట్లతో తెలంగాణలో గ్రీన్ వే పనులు ప్రారంభమ య్యాయి..

ఆసియాలో అన్నిటికంటే పెద్ద టన్నెల్ నిర్మాణం చేపడుతున్నాం.. దానికి సంబంధించి పనులు కొంత మేర పూర్తయ్యాయి.. సూరత్ నుంచి నాసిక్, అహ్మద్ నగర్, షోల పూర్ కర్నూలు, హైదరాబాద్ కన్యాకుమారి, కొచ్చి, త్రివేండ్రం బెంగళూర్ లను కలిపేలా గ్రీన్ వే నిర్మాణం చేపడుతున్నాం..

భిన్నత్వంలో ఏకత్వమే మన ప్రత్యేకత, అలాంటి సంస్కృతులను ఈ గ్రీన్ జాతీయ రహదారులు కలుపుతాయి.. 491 కోట్ల రూపాయలతో అదిలాబాద్ నుంచి బేల పనులు మంజూరు చేశాం.. ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల 5వేల కోట్లతో, 132 కిలోమీటర్ల దూరం జాతీయ రహదారి మంజూరు చేస్తున్నాం..

జగిత్యాల నుంచి కరీంనగర్ జాతీయ రహదారి రాబో యే 3నెలల్లో ప్రారంభం అవుతుంది.. నాగ్ పూర్ నుంచి హైదరబాద్ వరకు 471 కిలోమీటర్ల ఆరు లైన్ల జాతీయ రహదారి నిర్మాణం చేపడుతున్నా మని కేంద్రమంత్రి అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular