ప్రతి ఒక్కరికి గూడు కల్పిస్తా పోచారం
ద్రోణ బాన్సువాడ ప్రతినిధి
అభివృద్ధిలో, సంక్షేమ పథకాల అమల్లో బాన్సువాడ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిలపడమే తన అంతిమ లక్ష్యమని మాజీ మంత్రి, మాజీ శాసనసభాపతి, వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. బాన్సువాడ నియోజకవర్గం లోని పోచారం స్వగృహం ఆవరణలో ఇందిరమ్మ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి కొంతమంది ఇందిరమ్మ కమిటీ సభ్యులు గైరాజర్ కావడంపై పోచారం అధికారులపై నిప్పులు చెరిగారు. ప్రభుత్వ లక్ష్యాన్ని అధిగమించాలని ఇందిరమ్మ ఇళ్ల ఇళ్ల జాబితాను సిద్ధం చేసేందుకు సమావేశాన్ని ఏర్పాటు చేస్తే కమిటీ సభ్యులను హాజరుపరచడంలో కార్యదర్శులు నిర్లక్ష్యం చేయడంపై పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. గ్రామాల్లోని నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయడం జరుగుతుందన్నారు. గతంలోనూ బాన్స్వాడ నియోజకవర్గంలో రెండు పడక గదుల నిర్మాణాలను చేపట్టడంలోనూ తెలంగాణ రాష్ట్రంలోనే ముందంజలో ఉన్నామని గుర్తు చేశారు. నియోజకవర్గంలో సుమారు 11 వేల ఇళ్ల మంజూరు చేయడం జరిగిందన్నారు. గతంలో ఇల్లు నిర్మించుకొని కొంతమంది బిల్లులకు నోచుకోలేకపోయారని ఇప్పటికైనా ఇళ్ల నిర్మాణదారులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అతి త్వరలోనే లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు జరుగుతుందన్నారు.
గుడిసె లేని నియోజకవర్గం గా తీర్చిదిద్దడమే తన లక్ష్యం
బాన్సువాడ నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలో గుడిసె కనపడకుండా చేయడమే తన లక్ష్యంగా భావిస్తున్నానని పోచారం శ్రీనివాస్ రెడ్డి తన మనోభావాన్ని వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా చేపట్టి రాష్ట్రంలోనే తన నియోజకవర్గం ఆదవర్షవంతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నానని, అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పేదలకు సేవ చేయడమే తమ లక్ష్యంగా ఎంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం బాన్సువాడ నియోజకవర్గానికి 3514 ఇందిరమ్మ ఇళ్ళు మంజూరయ్యాయని పేర్కొన్నారు. గ్రామాల వారీగా ఇళ్ల మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇళ్ల మంజూరి మహిళల పేరుతో ఇవ్వడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీల సమావేశాన్ని నిర్వహించి గ్రామాల్లోని నిరుపేదలకు ఇల్లు అందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ఇళ్ల మంజూరిలో పారదర్శకంగా వ్యవహరించడంతోపాటు నిరుపేదలకు ఇళ్ళను అందిస్తామన్నారు. ఇళ్ల నిర్మాణాల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, మొదటి విడతలో ఇల్లు మంజూరు కానీ వారు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇల్లు నిర్మించుకునేందుకు పేదలు ముందుకొస్తే ఇల్లు మంజూరు చేయడం తన బాధ్యత అని స్పష్టం చేశారు. 400 చదరపు అడుగుల్లో ఇంటి నిర్మాణం చేపట్టుకుంటే లబ్ధిదారులకు విడతల వారీగా డబ్బు చెల్లించడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం నుండి లబ్ధిదారులకు ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుందన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద సాహసోపేత నిర్ణయం తీసుకోలేదన్నారు. ఇటువంటి సదవకాశాన్ని నిరుపేదలు సద్వినియోగం చేసుకోవాలని స్పష్టం చేశారు. లబ్ధిదారులు ఎవరైనా ఎక్కువమంది కుటుంబ సభ్యులు ఉంటే వారు అదనపు డబ్బును భరించే పరిస్థితిలో ఉంటే 600 చదరపు అడుగులు మించకుండా ఇంటి నిర్మాణాన్ని చేపట్టుకునే వీలు ఉందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ఎంపికలో అవకతవకలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని పోచారం శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ జిల్లా సహకార బ్యాంకు చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, కోటగిరి తాసిల్దార్ గంగాధర్, ఇన్చార్జ్ ఎంపీడీవో చందర్ నాయక్, కోటగిరి మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమంతు, మాజీ చైర్మన్ హంగార్గ గంగాధర్, జుబేర్, శ్రీధర్, కృష్ణారెడ్డి, జగదీష్, రాంబాబు, సాయిలు, శ్రీనివాసరావు, సుబ్బారావు మరియు నియోజకవర్గానికి చెందిన పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, తాసిల్దారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.






