ప్రాజెక్టు పనులను పూర్తి చేయాలని ఆదేశించిన పోచారం
సిద్ధాపూర్ రిజర్వాయర్ను నిర్మాణ పనులను పూర్తి చేసి నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోలేని భూములకు సాగునీరు అందించి రైతులకు కళ్ళల్లో ఆనందాల ను చూడడమే తన లక్ష్యమని మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
బాన్సువాడ నియోజకవర్గం వర్ని మండలం సిద్దాపూర్ వద్ద నూతనంగా నిర్మిస్తున్న సిద్దాపూర్ రిజర్వాయర్ నాలుగు ఆనకట్టల నిర్మాణ పనులను గురువారం పోచారం పరిశీలించారు.
సిద్దాపూర్ రిజర్వాయర్ రూ. 258 కోట్ల రూపాయల వ్యయంతో, ఒక టీఎంసీ సమర్థంతో నిర్మిస్తున్నాం. నిర్మాణ పనులు త్వరితంగా పూర్తి కావాలి.నాలుగు ఆనకట్టల నిర్మాణ పనులను మరింత వేగంగా జరిపించాలని ఎక్కువ యంత్రాలను తెప్పించి మరింత వేగంగా రాత్రింబవళ్లు పనులు చేయాలని కాంట్రాక్టర్ కు సూచించారు.ఇరిగేషన్ అధికారులు, ఇంజనీర్లు 24 గంటలు అందుబాటులో ఉంటూ నిర్మాణ పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు.
పనులు వేగంగా జరిపించడంతో పాటుగా నాణ్యత లోపం లేకుండా చూడాలని సూచించారు.
రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని నిత్యం పర్యవేక్షిస్తూ ఉంటాను. సిద్ధాపూర్ రిజర్వాయర్ నా ఆశయం,ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా సాగునీరు అందాలి.
అనంతరం జాకోరా ఎత్తి పోతల పథకం నిర్మాణ పనులను మరియు వర్ని మండల కేంద్రంలోని నూతనంగా రూ. 10.70 కోట్లతో నిర్మిస్తున్న 30 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను పర్యవేక్షించిన వారిలో చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్, సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ రాజశేఖర్, వర్ని విండో మాజీ అధ్యక్షులు బుజ్జి, కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.














