Friday, February 13, 2026

అంగరంగ వైభవంగా చౌడేశ్వరి మాత కళ్యాణ వేడుకలు

ద్రోణ బోధన్

అంగరంగ వైభవంగా చౌడేశ్వరి మాత కళ్యాణ వేడుకలను భక్తులు నిర్వహించారు. కళ్యాణ వేడుకలు సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం సంతరించుకుంది.
రుద్రూర్ మండల కేంద్రంలోని శ్రీ రామలింగ చౌడేశ్వ రి మాత ఆలయంలో మంగళవారం దేవాంగ కులస్తుల ఆరాధ్య దైవమైన శ్రీ చౌడేశ్వరి మాత కళ్యాణ వేడుకలను అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు. ముందుగా అమ్మవారి ఊరేగింపు కార్యక్రమాన్ని చేపట్టారు. వైశాఖమాసం సందర్భంగా గత నెల రోజుల నుండి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, భజనలు, కీర్తనలు, ప్రసాద వితరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంఘం అధ్యక్షులు శ్యామ్ సుందర్ పహాడే, నూత్ పల్లి గణేష్, లోగం నాగరాజు, ఈర్వ శ్రీనివాస్, నూత్ పల్లి బాలరాజు, నూత్ పల్లి వినోద్, కన్నె రవి, సతీష్, ఉమాకాంత్, బాలరాజ్, లోగం రాజేష్, తొర్తి చందర్, లోగం సురేష్, దేవాంగ కుల సభ్యులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular