గుడిసె లేని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతా పోచారం వెల్లడి
నిరుపేదలకు నీడనివ్వడానికి నియోజకవర్గ పెద్దాయన తపన ఎలా ఉందో మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ముందుగా గతం లో డబుల్ బెడ్ రూమ్ లు కేవలం బాన్సువాడ కి ఎందుకు ఎక్కువ వచ్చాయి అనేది ఆలోచిస్తే పెద్దాయన మానవతా దృక్పథం తో వీలైనంత మందికి ఇండ్లు నిర్మించి ఇవ్వాలనే తపన కనిపించింది..ఆ తపన తోనే ఏకంగా 11వేల డబుల్ బెడ్ రూం లు నియోజకవర్గం లో నిర్మించడం అనేది ఆషామాషీ విషయం కాదు…అందుకు ఆయన తన వయస్సును కూడా లెక్కచేయకుండా శ్రమించిన విషయం మీ అందరికీ మరొక్క సారి గుర్తుచేస్తున్నాను…ఎందరో కాంట్రాక్టర్ లను,నాయకులను ఇండ్లు కట్టించడని బతిమాలుకున్నారు.కాంట్రాక్టర్ లను , నాయకులను ఒప్పించిన తర్వాత నిర్మాణాల విషయం లో,బిల్లుల విషయం లో అటు అధికారులతో నిరంతరం సమీక్షిస్తూ లబ్ధిదారులకు ఒక జీవితపు నీడను అందించారు.ఇప్పటికీ బిల్లులు అందని వారికోసం బిల్లులు ఇప్పించడానికి తన వయస్సుకు మించి,తన పెద్దరికాన్ని పక్కన పెట్టీ శ్రమిస్తున్నారు…
మళ్ళీ ఈ ప్రభుత్వ హయం లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం అర్హులైన వారిని అధికారులు ఎంపిక చేసిన తర్వాత నిరుపేదలకు ఇంటి నిర్మాణ భారం పడకుండా ఇంటి దగ్గర కూర్చుని ఏమేం చేస్తున్నారో ఒక సారి మీ అందరికీ తెలియాలి…
*ఆ పెద్దాయన పెద్ద మనసు ఎలాంటిదో మరొక్కసారి మీ అందరికీ గుర్తు చేయాల్సిన అవసరం ఉంది
నియోజకవర్గం లో నిర్మించే ఇందిరమ్మ ఇండ్ల కు ఇసుక సరఫరా చేసే ట్రాక్టర్ యజమానులతో,ఆయ గ్రామాల నాయకులతో చర్చించి వీలైనంత తక్కువ ధరలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇసుక అందించాలని వేడుకుని,వారిని ఒప్పించిన ప్రజల మనిషి ఆయన.
మరో వైపు నిర్మాణ రంగం లో ఉన్న సంఘాల నాయకులతో చర్చించి నిరుపేదలకోసం చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి వీలైనంత తక్కువ లో నిర్మించి ఇచ్చేలా మేస్త్రిల సహకారం కోరారు.
ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే పెద్దాయన ఆలోచన,పెద్దాయన పెద్ద మనస్సు ,ఆయన నిష్కల్మషంగా పేదలకు నీడను ఇవ్వడానికి అప్పుడు ఆ ప్రభుత్వం లో,ఇప్పుడు ఈ ప్రభుత్వం లో ఎలా పరితపిస్తుంది మీ అందరి ముందు ఉంచాలనే ఆలోచన మాత్రమే…
మన స్థానిక మరో నాయకుడు ,రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు తో,యువనాయకుడు భాస్కర్ రెడ్డి గారితో , స్థానికంగా ఉండే నియోజకవర్గం లోని ఆయా గ్రామాల ,మండలాల నాయకత్వం తో చర్చిస్తూ… వీలైనంత ఎక్కువ మందికి ఇండ్లు కట్టించాలని తపన పడుతున్నారు.
ఉదయం లేవగానే ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ది దారుల ఇండ్ల నిర్మాణానికి ముగ్గు వేశారు, ముగ్గు వేసిన వారి పనులు ప్రారంభించారా అంటూ స్థానిక నాయకత్వాన్ని,అధికారులను, పురమాయిస్తూ ఈ వయస్సులో కూడా తపిస్తున్నారు..ఇటీవల మొన్న బాన్సువాడ మండలం,మున్సిపాలిటీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు నిర్మాణ మంజూరు పత్రాలు ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పంపిణీ చేశారు.అనంతరం కోటగల్లి లో ఒక ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసే వరకు మధ్యాహ్నం 3 దాటింది.అప్పటికి ఇంకా పెద్దాయన మధ్యాహ్న భోజనం కూడా చేయలేదు..అక్కడే ఉన్న స్థానిక నాయకులు లంచ్ టైమ్ చాలా అయింది బయలుదేరుదాం అన్నారు..దానికి పెద్దాయన స్పందిస్తూ…ఒక పేద కుటుంబానికి నీడను ఇవ్వడానికి భూమి పూజ చేసిన తృప్తి తో నా కడుపు నిండింది అని సమాధానం ఇచ్చారు…ఇది పెద్దాయన మనస్తత్వం…
ఇది ప్రజల మనిషి ,ఈ బాన్సువాడ ప్రజల మనిషి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి గొప్పతనం అప్పుడైనా,ఇప్పుడైనా
ఎప్పుడైనా ప్రజలకు వీలైనంత సేవ చేయడమే ఆయన ఆశయం ఆయన ఊపిరి
భారత దేశం మొత్తం లో ఏ శాసన సభ నియోజక వర్గంలో ఒక ఎమ్మెల్యే గా ఎవరు నిరుపేదలకు ఇండ్లు సాధించి పెట్టారు అంటే అది కేవలం మన బాన్సువాడ ముద్దు బిడ్డ పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ పేరు మాత్రమే వినిపిస్తుంది…ఇది ముమ్మాటికి నిజం.
అందుకే ఆయన ప్రజల మనిషి,పేద ప్రజల మనిషి అన్నిటికంటే మానవత్వం మూర్తీభవించిన మహా మనిషి అంటాను.


