258 కోట్లతో రిజర్వాయర్ పనులు
1400 ఎకరాల భూములకు సాగునీరు అందించడమే లక్ష్యం
ఖరీఫ్ లో ఎరువుల కొరత లేకుండా చూడాలన్న పోచారం
ద్రోణ బోధన్ ప్రతినిధి
నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలో లేని భూములకు సాగునీరు అందించి సిద్దాపూర్ ప్రాంత భూములను సస్యశ్యామలం చేయడమే తన లక్ష్యమని పోచారం వ్యక్తం చేశారు. రాబోయే ఖరీఫ్ సీజన్లో బాన్సువాడ ప్రాంతంలోని రైతాంగం ముందస్తుగా వరి పంటను సాగు చేస్తున్నారని ఈ ప్రాంత రైతులకు పచ్చరొట్టె, మరియు ఎరువుల కొరతను రాకుండా చూడాలని మాజీ మంత్రి ప్రస్తుత వ్యవసాయ శాఖ ముఖ్య సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్ లో తన కార్యాలయంలో బాన్సువాడ గ్రామీణ మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులపై,బాన్సువాడ నర్సింగ్ కళాశాల పనులపై, రాష్ట్ర వ్యవసాయ శాఖ అందిస్తున్న పచ్చిరొట్ట ఎరువుల (జిలుగు,పిల్లి పెసర) పంపిణీ కి సంబంధించి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం మంగళవారం పోచారం నిర్వహించారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ గోపి తో సమీక్ష సమావేశంలో పోచారం మాట్లాడుతూ
రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎరువులు, పచ్చిరొట్ట (జిలుగు, పిల్లి పెసర) ఎరువులు ముందస్తుగా రైతులకు అందుబాటులో ఉంచాలని ఎక్కడ ఎరువుల కొరత రానివ్వద్దని సూచించారు.రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజక వర్గంలో ముందుగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానున్న సందర్బంగా రైతులకు ఎలాంటి కొరత లేకుండా ఎరువులు,పచ్చిరొట్ట ఎరువులు కొరత పంపిణీ చేయాలని సూచించారు.
బాన్సువాడ నర్సింగ్ కళాశాల నిర్మాణ పనుల విషయంలో రోడ్లు భవనాల శాఖ చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు.
నర్సింగ్ కళాశాల భవన నిర్మాణం పూర్తి అయినందున మిగతా చిన్న చిన్న పనులను తొందరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు.
సిద్దాపూర్ రిజర్వాయర్ పనులపై
ఇరిగేషన్ చీఫ్ ఇంజనీ శ్రీనివాస్ తో సమీక్ష సమావేశం నిర్వహించారు.రిజర్వాయర్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
బాన్సువాడ నియోజకవర్గం ప్రధానంగా వ్యవసాయ ఆధారితం.సిద్ధాపూర్ రిజర్వాయర్ నా ఆశయం, ఈ ప్రాంతంలోని 14,000 ఎకరాల మెట్ట భూములకు పుష్కలంగా నీళ్ళు అందాలి. ఆర్ధికంగా రైతులు స్థిరపడాలని నా కల. నా కల సహకారం చేసేందుకు అధికార యంత్రాంగం సహకరించాలని కోరారు.
భవిష్యత్తులో సిద్ధాపూర్ రిజర్వాయర్ అయకట్ట సస్యశ్యామలంగా ఉండాలి అనేది నా ఉద్దేశ్యం.
రూ. 258 కోట్ల రూపాయల వ్యయంతో, ఒక టిఏంసి కెపాసిటీ తో నిర్మిస్తున్నాం.
రిజర్వాయర్ కట్టతో పాటుగా పొలాలకు నీళ్ళందించే కుడి, ఎడమ కాలువల పని కూడా త్వరిత గతిన పూర్తి చేయాలి.
భవిష్యత్తు తరాల రైతులు సాగునీటికి ఇబ్బందులు లేకుండా పంటలు పండించుకోవాలి.
గిరిజనులు, మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందించాలని కష్టపడి సిద్దాపూర్ రిజర్వాయర్ కట్టిస్తున్నాము.
ఈ సమావేశాలలో , రోడ్లు భవనాల శాఖ, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ భూలక్ష్మి , ఇతర అధికారులు,కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

