Friday, February 13, 2026

చిన్న రాష్ట్రాలతో అభివృద్ధి సాధ్యం

జాతీయ జెండాను ఎగురవేసిన పోచారం

చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమైన విషయం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో రుజువైందని ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అవతరణ దినోత్సవం బాన్సువాడలో ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి సాధించిందని రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా నిలిచిందని పోచారం పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పోచారం నివాసం వద్ద మరియు ఎంఎల్ఏ క్యాంపు కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను పోచారం ఆవిష్కరించారు. తెలంగాణ అవతరణ దినోత్సవం పురస్కరించుకొని బాన్సువాడ నియోజకవర్గం ప్రజలకు పోచారం శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్మయి, బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి , స్థానిక ప్రజా ప్రతినిధులు,నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular