Thursday, February 12, 2026

పేదోళ్ల సొంతింటి కల నెరవేర్చడం కాంగ్రెస్ లక్ష్యం

ద్రోణ వరంగల్ ప్రతినిధి

పేదవాళ్ల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య అన్నారు. ఇందిరమ్మ కన్న కలలను నెరవేర్చడం పేద ప్రజల అభ్యున్నతికి కృషి చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుందన్నారు.
పరకాల పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డు నందు పరకాల నియోజకవర్గం లోని అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి తో కలసి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య ముఖ్య అతిథిగా హాజరై పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ డా.కడియం కావ్య మాట్లాడుతూ కాంగ్రెస్‌ పేదల ప్రభుత్వమని, మా ప్రభుత్వం రాష్ట్రంలోని పేద వర్గాలకు అండగా ఉంటుందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కావ్య అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని గుర్తు చేశారు. ముఖ్యంగా వ్యవసాయాన్ని పండుగ చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగా రైతులకు రుణమాఫీ, రైతుభరోసా, రైతుబీమా, పంటల బీమా తదితర పథకాలతో రైతన్నలను ఆదుకుంటుందన్నారు. పరకాల నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి , టిపిసిసి ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య , జిల్లా కలెక్టర్ ప్రావీణ్య , అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular