Thursday, February 12, 2026

భూ భారతి గ్రామ రెవిన్యూ సదస్సు

ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్

రైతుల హక్కులను కాపాడటం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారత్ నీ పెట్టిందని, గత ప్రభుత్వాలు చట్టాలను అసంబద్ధంగా అమలు చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోని ఎంతో మంది రైతులు ఇబ్బందుల గురయ్యారని రైతుల ఇబ్బందులను తొలగించేందుకు భూభారతిని అమలు చేస్తున్నట్లు ఎంపీ సురేష్ శెట్కర్ అన్నారు.
న్యాలకల్ మండలంలోని మిర్జాపూర్(N) గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టం గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొని, ఇందిరమ్మ ఇళ్లకు భూమీ పూజ చేశారు. ఈ సందర్భంగా *ఎంపీ. సురేష్ కుమార్ షెట్కార్ మాట్లాడుతూ భూ భారతి చట్టం ద్వారా రైతులందరికీ సరియైన లాభం జరుగుతుంది.మరియు పేదవారి సొంతింటి కళ కేవలం ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంతోనే సాధ్యమని వారు వ్యాఖ్యానించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్విన్ ఛైర్మెన్ గిరిధర్ రెడ్డి ,మాజీ ఇండస్ట్రియల్ ఛైర్మెన్ తన్వీర్ ,నియోజకవర్గ మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా తబస్సుమ్,మండల అధ్యక్షులు హన్మంత్ రావ్ పాటిల్ ,శ్రీనివాస్ రెడ్డి , నరసింహా రెడ్డి ,ఏఎంసీ.వైస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉజ్వల్ రెడ్డి ,మాజీ జడ్పీటీసీ భాస్కర్ రెడ్డి ,కోహిర్ మాజీ వైస్ ఎంపీపీ శాకిర్ అలీ ,PACS ఛైర్మెన్ సిద్దిలింగయ్య,మాజీ వైస్ ఎంపీపీ గౌస్ , కాంగ్రెస్ నాయకులు మంకల్ శుభాష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular