Thursday, February 12, 2026

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యతగా గుర్తించాలి

వనమావత్వంలో పాల్గొన్న ఎమ్మెల్యే పి.సుదర్శన్ రెడ్డి

కలెక్టర్ తో కలిసి మొక్కలు నాటిన ఎమ్మెల్యే

నిజామాబాద్, ద్రోణ జూలై 09

మొక్కలు నాటడం వాటి పెంపకం పట్ల ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా గుర్తించాలని భవిష్యత్ తరాలకు పర్యావరణముక్కు వాటిల్లకుండా కాపాడాల్సిన ప్రతి ఒకరిపై ఉందని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు.
పచ్చదనాన్ని పెంపొందిస్తూ, భవిష్యత్ తరాలకు స్వచ్చమైన గాలి, ఆహ్లాదకర పర్యవరణం అందించాలనే బృహత్తర సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని బోధన్ శాసన సభ్యులు పిలుపునిచ్చారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డితో కలిసి బుధవారం బోధన్ పట్టణంలోని మధుమలంచ డిగ్రీ కళాశాల మైదానంలో ఎమ్మెల్యే లాంచనంగా మొక్కలు నాటి జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో 500 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ, మొక్కలు నాటాల్సిన ఆవశ్యకత గురించి ఎవరికి వారు గుర్తిస్తూ, విధిగా మొక్కలు నాటాలని సూచించారు. మొక్కల వల్ల పర్యావరణ సమతుల్యం కాపాడబడడంతో పాటు పచ్చదనం పెరిగి సకాలంలో వర్షాలు కురుస్తాయని, జీవ కోటికి స్వచ్చమైన ప్రాణ వాయువు లభిస్తుందని గుర్తు చేశారు. ఇది మనకే కాకుండా మన భవిష్యత్ తరాలకు కూడా ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మొక్కల పెంపకానికి ప్రాధాన్యతను ఇస్తూ పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తోందన్నారు. ప్రభుత్వ సంకల్పానికి అనుగుణంగానే కాకుండా, మన అవసరాల రీత్యా కూడా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి, వాటి పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. కొత్త రేషన్ కార్డులను మంజూరు చేస్తూ, సన్న బియ్యం పంపిణీ చేస్తోందని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్ళను అందిస్తోందని గుర్తు చేశారు. విద్యా రంగ అభివృద్దికి ప్రత్యేక చర్యలు చేపదుతున్నామని, తమ పిల్లలను అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ బడులలలో చదివించాలని ఎమ్మెల్యే హితవు పలికారు. మహిళల సంక్షేమం, సాధికారత కోసం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తున్నామని తెలిపారు.
కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వన మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. పక్షం రోజులలోనే పూర్తి స్థాయిలో మొక్కలు నాటి సంపూర్ణ లక్ష్యం సాధించేలా ముందస్తుగానే ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేశామని అన్నారు. గత సంవత్సరం వన మహోత్సవం సందర్భంగా 43 లక్షల మొక్కలు నాటగా, వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగిందన్నారు. వివిధ కారణాల వల్ల చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటుతున్నామని తెలిపారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 51.11 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఈ లక్ష్య సాధన కోసం ముందుగానే నర్సారీలలో మొక్కలను సిద్ధం చేసి, అనువైన ప్రదేశాలలో గుంతలు తవ్వి మొక్కలు నాటేందుకు అధికారులు, సిబ్బంది అందరినీ సన్నద్ధం చేశామని కలెక్టర్ వివరించారు. గత ఏడాది వన మహోత్సవం అమలులో జరిగిన లోటుపాట్లను గుర్తిస్తూ, ఈసారి అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. నాటిన ప్రతి మొక్క బ్రతికేలా, పకడ్బందీగా సంరక్షణ చర్యలు చేపడుతున్నామని, దీని వల్ల ఉపాధి హామీ కూలీలకు ఎక్కువ పని దినాలు లభించడంతో పాటు గ్రామ పంచాయతీలకు కూడా ఆదాయ వనరులు సమకూరుతాయని కలెక్టర్ అన్నారు. అన్ని వర్గాల వారిని వన మహోత్సవంలో భాగస్వాములు చేస్తూ, జిల్లాలో సంపూర్ణ లక్ష్యాన్ని సాధిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హమ్దాన్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీఓ సాయాగౌడ్, సివిల్ సప్లై డీ.ఎం శ్రీకాంత్ రెడ్డి, అధికారులు, స్థానికులు, విద్యార్థినిలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular