ఎమ్మెల్యేను కలిసిన నూతన ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ కార్యవర్గం
బోధన్ ద్రోణ:-
నూతన కార్యవర్గం ఏర్పాటు అయిన సందర్భంగా ప్రెస్ క్లబ్ ప్రింట్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్ (వాసు), గౌరవ అధ్యక్షులు తేళ్ల రవి, ముఖ్య సలహాదారుడు బలరామరాజు, కార్యదర్శి కృష్ణ, కోశాధికారి మొహమ్మద్ అహ్మద్, లతో కలిసి కమిటీ ప్రతినిధులు, సభ్యులు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ని గురువారం ఇరిగేషన్ కార్యాలయంలో కలవడం జరిగింది. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని శాలువాతో సత్కరించి ప్రింట్ మీడియా నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర ఆనాటి నుంచి చాలా ముఖ్యపాత్ర పోషిస్తున్నారని ఆయన తెలిపారు. జర్నలిస్టుల ఐక్యత కోసం యూనియన్లుగా ఏర్పడడం సమాజాభివృద్ధికి జర్నలిస్టులు చేస్తున్న కృషి ఎంతో అభినందన నియమని కొనియాడారు. జర్నలిస్టుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని తన వంతు కృషిగా జర్నలిస్టుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన స్పష్టంచేశారు. ఎన్నో ఏళ్లుగా జర్నలిస్టులు ఎన్నో కష్టాలు పడుతూ వారి వృత్తికి న్యాయం చేస్తూ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ వారి గమ్యాన్ని చేరుకుంటున్నారు. ఇకనైనా వారికి వారికి న్యాయం చేకూర్చేలా చూస్తానని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో లింబూరు లక్ష్మణ్, మునగరి రాజేష్, బండారి సాయిలు, కారం స్వామి, ఉమాకాంత్, సాంబశివరావు, అశోక్, రాజశేఖర్, మల్లికార్జున్, జగన్, శివ, తదితరులు పాల్గొనడం జరిగింది.
