Thursday, February 12, 2026

లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లు నిర్మించాలి

మహిళా సంఘాల నుంచి రుణాలు అందజేయాలి.

ద్రోణ బోధన్:-

ఎవరికైతే ఇల్లు నిర్మించుకోవడానికి డబ్బులు లేవు అటువంటి వారిని ఎంపిక చేసి మహిళా సంఘాలలోని సభ్యులు తమ వార్డులోని లబ్దదారులకు 50 వేల నుండి లక్ష రూపాయల వరకు రుణాలు అందజేయాలని మున్సిపల్ కమిషనర్ జాదవ్ కృష్ణ తెలిపారు.

మెప్మా ఆర్పీల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారందరికీ మెప్మా కార్యక్రమాలపై ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం వేగవంతం చేయాలని ఇల్లు ఎవరికైతే మంజూరు అయ్యిందో అటువంటి వారి దగ్గరకు వెళ్లి సంఘంలో ఉన్నట్లయితే బ్యాంకు నుండి కానీ సమైక్య నుండి కానీ రుణం ఇప్పించి వారు ఇల్లు నిర్మించుకునేలా చేయాలని ఎవరైనా లభ్యదారులు సంఘంలో లేని పక్షంలో వారిని దగ్గరలో ఉన్న సంఘంలో చేర్చుకునేందుకు ప్రయత్నం చేసి సంఘ సభ్యులతో మాట్లాడి వారికి కూడా లోను వచ్చే విధంగా చేయాలని తెలిపారు. ఈ విధంగా ఇప్పించినా రుణాలను ప్రభుత్వం నుండి ఆ లభ్యదారులకు డబ్బులు మంజూరు అయిన వెంటనే తిరిగి చెల్లించేలా ప్రతి నెల వాయిదాలలో తిరిగి కట్టే విధంగా చేయాలి. ఇంటి నిర్మాణం స్టేజి వారీగా పూర్తి చేసిన తరువాత విడతల వారీగా వస్తూ ఉంటాయి.

కాబట్టి లబ్ధిదారులు కచ్చితంగా తిరిగి చెల్లించేలా చూసుకోవాలి బోధన్ పట్టణంలోని ఇందరమ్మ ఇల్లు నిర్మించడానికి మహిళా సంఘాల తరఫున 13 మందికి రుణాలు అందజేయడం జరిగిందని ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రతి వారం మెప్మా తరఫునుంచి ఆర్పీ లతో ఇందిరమ్మ ఇండ్ల లోన్ల విషయంపై సమీక్ష కృషి చేయాలని తెలపడం జరిగింది. విడతల వారీగా వచ్చిన రుణాలను కచ్చితంగా బ్యాంకులలో లేదా సమైక్యలో కట్టించేలా ఆర్పీలకు సూచించారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ రమేష్, మెప్మా టి ఎం సి శ్రీనివాస్, సి ఓ లు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular