ద్రోణ బాన్సువాడ ప్రతి నిధి:-
మాత శిశు సంక్షేమ ఆసుపత్రి నిర్వహణ, పనితీరు పట్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు, ఆసుపత్రి అడ్వైసరి కమిటీ అధ్యక్షులు పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు, బాన్సువాడ సబ్ కలెక్టర్ శ్రీమతి కిరణ్మయి, ఆసుపత్రి సూపరిండెంట్ శ్రీమతి Dr విజయ లక్ష్మి,అడ్వైసరి కమిటీ సభ్యులు, పట్టణ ప్రజాప్రతినిధులు,నాయకులు

సమావేశంలో పోచారం మాట్లాడుతూ…
బాన్సువాడలో 1997 సంవత్సరంలో 100 పడకల ఆసుపత్రిని నిర్మించుకున్నాం ఆస్పత్రి నిర్మించుకున్న తర్వాత ప్రత్యేక శ్రమతో ఆస్పత్రికి మంచి పేరు వచ్చింది.కాలక్రమేన అవసరాల నిమిత్తం వందపడకల మాత శిశు సంక్షేమ ఆసుపత్రి కూడా నిర్మించుకున్నాం తెలంగాణ రాష్ట్రంలోనే మాత శిశు సంక్షేమ ఆసుపత్రికి మంచి పేరు వచ్చింది, అవార్డులు వచ్చాయి.ఆసుపత్రిలోని సేవల విషయంలో డెలివరీ, ఆపరేషన్, ట్రీట్మెంట్ విషయంలో కానీ వేరే ఇతర ప్రభుత్వ ఆసుపత్రులతో పోలిస్తే మాత శిశు సంక్షేమ ఆసుపత్రి గాని ఏరియా ఆసుపత్రి వైద్యులు సిబ్బంది.

అద్భుతమైన సేవలందిస్తున్నారు.మేము మౌలిక సదుపాయాలు కల్పిస్తాం అంతేకానీ రోగుల కష్టాల్ని బాధలను తీర్చేది వైద్యులే ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ విజయలక్ష్మి సుదీర్ఘ అనుభవం గల వ్యక్తి కామారెడ్డి ఏరియా ఆసుపత్రిలో పని చేసిన అనుభవం కల వైద్యురాలు, అలాంటి డాక్టర్ విజయలక్ష్మి నాయకత్వంలో వైద్యులు గాని సిబ్బంది గానీ బాగా పని చేస్తున్నారు. ఇంత పెద్ద ఆసుపత్రికి చిన్న చిన్న ఇబ్బందులు రావడం సహజం, అలాంటి ఇబ్బందులను ఎలా అధిగమించాలని చర్చించుకున్నాం ఇదివరకు సూపరిండెంట్ గా పని చేసిన డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ ఆధ్వర్యంలో కూడా ఆస్పత్రికి ఎన్నో అవార్డులు వచ్చాయి.అడ్వైజరి కమిటీ సభ్యులు లేవనెత్తిన సమస్య అంబులెన్స్ కొరత ఉందని దానికి సంబంధించి కమిషనర్ గారితో మాట్లాడాను సానుకూలంగా స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో నా సొంత ఖర్చులు 22 లక్షల రూపాయలతో ఒక అంబులెన్స్ ఇప్పించాను

ప్రైవేట్ అంబులెన్స్ బెడద పోవాలంటే ఇంకొక అంబులెన్స్ అవసరం ఉంది, అడ్వైసరి సభ్యులు సలహా మేరకు ఇంకొక అంబులెన్స్ తెప్పించుకుంటున్నాం. ఆస్పత్రి చాలా పెద్దది, అన్ని MCH, ఏరియా ఆసుపత్రి డయాలసిస్తో కలిపితే 230 పడకల ఆసుపత్రి ఇంత పెద్ద ఆసుపత్రికి ఒక ఔట్ పోస్టు పెట్టించమని కమిటీ సభ్యులు అడిగారు దానికి జిల్ల ఎస్పీ గారికి మాట్లాడగా సానుకూలంగా స్పందించారు. ఆస్పత్రిలో డయాలసిస్ కూడా అందుబాటులో ఉంది.

వారంలో మూడుసార్లు డయాలసిస్ చేయించుకుంటున్నారు.గత ఆరు నెలలలో ఆసుపత్రిలో 348 ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు జరిగాయి, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ మన ఆసుపత్రిలో అందుబాటులో ఉంది. పేద ప్రజల దృష్టిలో, నా దృష్టిలో ఆసుపత్రి ఒక దేవాలయం, డాక్టర్లే దేవుళ్ళుఅత్యవసర పరిస్థితిలో ప్రాణాలు కాపాడేది ఎమ్మెల్యేలు,మంత్రులు కాదు డాక్టర్లే ప్రాణాలు కాపాడుతారు అలాంటి డాక్టర్లను గౌరవించుకుందాం ప్రైవేట్ అంబులెన్స్ల సమస్య పోలీసు వారితో మాట్లాడం వారు సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.
