టీజీవీపీ ఆధ్వర్యంలో ధర్నా
ద్రోణ బిక్కనూర్:-
టి జీ వి పి తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షులు గంధం సంజయ్ మాట్లాడుతూ బిక్కనూర్ గ్రామంలో ఉన్నటువంటి జూనియర్ కళాశాలలో కొద్ది రోజుల క్రితం వచ్చినటువంటి బైపిసి కోర్స్ కి సంబంధించిన బయాలజీ బోటనీ మరియు ఎం పీ సీ కి సంబంధించిన కెమిస్ట్రీ సబ్జక్ట్స్ చెప్పేటటు వంటి ఉపాధ్యాయులు కళాశాలలో లేరు అని దీనిపై నోడల్ ఆఫీసర్ సలాం సార్ కి ఎన్నిసార్లు వినతిపత్రం ఇచ్చిన పట్టించుకోనటు వంటి దారుణ పరిస్థితి వెంటనే ఈ సమస్యపై ఆర్ ఐ ఓ స్పందించి అలాగే కామారెడ్డి జిల్లా జూనియర్ కళాశాల నోడల్ ఆఫీసర్ సలాం ప్రత్యేక దృష్టి పెట్టి భిక్కనూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు మూడు సబ్జెక్టుల ఉపాధ్యాయులని వెంటనే మంజూరు చేయాలని కోరారు అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న గాని ఇప్పటికీ విద్యా శాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటు అని విద్యాశాఖ అధికారులు విద్యార్థుల భవిష్యత్తులతో చెలగాటం ఆడకుండా వీలైనంత తొందరగా బిక్కనూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల కి మూడు పోస్టులు ఏవైతే ఖాళీగా ఉన్నాయో వాటిని వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరియు అలాగే కామారెడ్డి జిల్లా విద్యాశాఖ అధికారులను కోరడం జరిగింది లేనియెడల డి ఇ ఓ కార్యాలయాన్ని ముట్టడించే వరకు ఊరుకోమని తెలంగాణ విద్యార్థి పరిషత్ టీ జీ వి పి బిక్కనూరు శాఖ వారు డిమాండ్ చేసారు. ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులు కామారెడ్డి రామాయంపేట కళాశాల కు వలస వెళుతున్నారు. అని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త కోర్సులు మంజూరు చేసి తీరా విద్యార్థులు జాయిన్ అయిన తర్వాత ఉపాధ్యాయులను కేటాయించకపోవడం చాలా దారుణమైన పరిస్థితి అని పేర్కొన్నారు. జిల్లా అధికారులు వెంటనే స్పందించి ఉపాధ్యాయులను కేటాయించకపోతే కళాశాలలో ప్రవేశం పొందిన మిగతా విద్యార్థులు కూడా వేరే కళాశాలలకు వలస వెళ్లే ప్రమాదం లేకపోలేదు. ఇట్టి విషయంలో తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. లేనియెడల టీ జీ వి పి బిక్కనూర్ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా నియోజకవర్గ ఇన్చార్జ్ సమీర్ మండల ప్రెసిడెంట్ భరత్ కార్తీక్ కళాశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొనడం జరిగింది.
