బాన్స్ వాడలో ఘనంగా పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు
బాన్సువాడ ద్రోణ జూలై 23
ఆపదలో ఉన్నాం అన్న ఆదుకోండి అని అడిగిన వెంటనే అపన్న హస్తం అందించే జనహృదయనేత మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. బాన్సువాడ పట్టణంలో బుధవారం పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలకు నియోజకవర్గం నలుమూలల నుంచి చిన్నారులు, యువత ,మహిళలు ,రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ అభిమాన నాయకుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పోచారం స్వగృహంలో అడుగడుగునా తమ అభిమాన నాయకుడికి కేక్ కట్ చేయడంతో పాటు. రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. పలువురు యువత పోచారం భాస్కర్ రెడ్డికి గజమాలతో ఘనంగా సత్కరించారు. అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తునతరలివచ్చి భాస్కర్ అన్నకు మద్దతుగా నినాదాలు చేయడం విశేషం. అన్న భవిష్యత్తులో తమరే మాకు అండ అన్న రీతిలో పుట్టినరోజు వేడుకలు జరిపి తమ అభిమానాన్ని ఆప్యాయతను చాటుకున్నారు.










