కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
మోహన్ రెడ్డి విమర్శ
బోధన్ ద్రోణ జూలై 23
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో బిజెపి గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని స్థానికేతకల్లో కాంగ్రెస్ పార్టీకి పరాభం ఎదురు కాబోతుందని స్థానికన ఎన్నికల్లో ప్రజలు బిజెపి వైపు మొగ్గుచూపు పోతున్నారని ఆయన జోస్యం చెప్పారు.బోధన్ పట్టణంలోని ఎం పి ఆర్ కార్యాలయంలో బోధన్ రూరల్ మండల అధ్యక్షులు సిర్ప సుదర్శన్ అధ్యక్షతన స్థానిక సంస్థల ఎన్నికల కార్యశాల నిర్వహించారు . కార్యక్రమానికి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మాట్లాడుతూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తలు కష్టపడి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడం విఫలం అయిందని, తెరాస ప్రభుత్వం పది సంవత్సరాలు లక్షల కోట్లు అప్పు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అంతకంటే డబుల్ అప్పులు చేస్తుందని అన్నారు. నిజమైన అర్హులకు ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం లో, రైతు భరోసా,రైతులకు బోనస్ ఇవ్వడం లో,రైతులకు ఋణ మాఫీ చేయడం లో,రాజీవ్ యువ వికాస్ పథకల అమలు చేయడం లో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని అందుకు ప్రభుత్వం పై ప్రజలు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నారని విమర్శించారు. బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు కావడానికి సిద్ధంగా ఉండాలని ప్రతి ఒక్కరు వార్డు సభ్యులుగా, సర్పంచ్, ఎంపీటీసీ, సొసైటీ డైరెక్టర్, చైర్మన్, గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమం లో బీజేపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శులు లక్ష్మారెడ్డి, వెంకటేష్, మండల కార్యదర్శులు జయరాం, సౌందర్య కిరణ్, మాజీ అధ్యక్షులు మనోహర్,మాజీ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్, మాజీ ఎంపీటీసి లక్ష్మి రాజన్న, మాజీ ఉప సర్పంచ్ శ్రీనివాస్,సీనియర్ నాయకులు భాస్కర్ రెడ్డి, బూత్ అధ్యక్షులు, శక్తి కేంద్రం ఇంచార్జి లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

