Thursday, February 12, 2026

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో మేలు

బోధన్ ద్రోణ జులై 23

ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఎంతో మేలు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళలు ఎప్పటికీ రుణపడి ఉండాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వ సలహాదారు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసి తీరిందని, మహిళల పట్ల ప్రత్యేక ఆసక్తితో ప్రభుత్వం ఉందని మరెన్నో పథకాలను మహిళలకు అమలు చేయనుందని ఆయన అన్నారు.బాన్సువాడ బస్ స్టాండ్ లో డిపో మేనేజర్ సరిత దేవి ఆధ్వర్యంలో మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి రూ 6680 కోట్ల ప్రయాణ ఛార్జీలను ఆదా చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన మహాలక్ష్మి సంబరాల కార్యక్రమాన్ని జరుపుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైనా తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు ,బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular