Thursday, February 12, 2026

ఘనంగా మహిళా శక్తి సంబరాలు

పేదలందరికీ రేషన్ కార్డులు అందిస్తాం సీతక్క

నిజామాబాద్ జులై 29 ద్రోణ

కామారెడ్డిజిల్లా, దోమకొండ మండల కేంద్రంలో ఇందిర మహిళా శక్తి సంబరాలు కొత్త రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా షబ్బీర్ఆలీ మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు మరియు ఇందిరమ్మ ఇల్లు,ఇది ప్రజా ప్రభుత్వం పేదలకు సంక్షేమ పథకాలను అందించే ప్రభుత్వమని స్పష్టం చేశారు.ఆహార భద్రతలో తెలంగాణ రాష్ట్రం
దేశంలోనే మొదటి స్థానంలో ఉందన్నారు.రేషన్ కార్డు ఆహార భద్రత. కల్పించే కార్యక్రమంలో 1.15 కోట్ల కుటుంబాలలో 93 లక్షల కుటుంబాలకు రేషన్ కార్డులు అందించడంతో పాటు, ప్రతి వ్యక్తికి నెలకు 6 కిలోల సన్న బియ్యం ఉచితంగా అందజేస్తున్నాం. సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం భారతదేశ చరిత్రలో ఒక రికార్డుగా నిలిచింది,గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో సహాయపడుతుందన్నారు.
గత ప్రభుత్వాలు రేషన్ కార్డుల జారీని నిర్లక్ష్యం చేసినప్పటికీ, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రక్రియను వేగవంతం చేసింది.రేషన్ కార్డుల జారీలో పారదర్శకత కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పారదర్శకంగా, గ్రామసభలు ద్వారా అర్హులను గుర్తిస్తూ నిర్వహిస్తున్నాం. అర్హత గల ప్రతి కుటుంబానికి రేషన్ కార్డు అందేలా చర్యలు తీసుకుంటున్నాం, ఈ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతుంది.
తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి ఉంది, ఈ దిశగా చేపట్టిన కార్యక్రమాలు దేశంలోనే ఒక మైలురాయిగా నిలుస్తాయి.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు.సంబరాల్లో భాగంగా అక్షర లక్ష్మి కార్యక్రమం ద్వారా సంఘాల్లో సభ్యులుగా ఉన్న ప్రతి మహిళకూ కనీస విద్య అందేలా చర్యలు చేపడుతున్నాం.అదనంగా, మహిళా సంఘాల్లో భాగముకాని కొత్త మహిళలను చేర్చి, కొత్త సంఘాలను ఏర్పాటు చేయాలన్నారు.
మహిళా సంఘాలు మహిళలకు 10 లక్షల రూపాయల బీమాను కూడా అందిస్తున్నాం.ప్రతి సంఘ సభ్యురాలికి జీవిత భీమా తప్పనిసరిగా ఉండాలి.
తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి రెట్టింపు రుణం పొందాలి.
ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకునే మహిళలకు రూ1లక్షల రుణ సౌకర్యం కల్పించబడుతుందని తెలిపారు. ప్రభుత్వం నుండి మహిళలకు మహిళా సమైక్య ద్వారా పెట్రోల్ బంకులు ఎలక్ట్రిక్ బస్సులు అందజేస్తామన్నారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల స్కూల్ యూనిఫాంలు కుట్టే బాధ్యతను ఐకేపీ మహిళా సంఘాలకే అప్పగించడం ద్వారా స్వయం ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.భవిష్యత్తులో ప్రైవేట్ సంస్థలకు అవసరమైన యూనిఫాంలను కుట్టే పనులను కూడా మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ లో స్త్రీ శిశు సంక్షేమానికి 2862 కోట్లు
కేటాయించి మహిళలకు పెద్దపీట వేశామన్నారు.
వారిని కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పలు పథకాలను ప్రతిపాదించిన రేవంత్ సర్కారు. గ్రామీణ మహిళాభివృద్ధికి ఇందిరా మహిళా శక్తి పథకం మహిళకు ఒక వరం లాంటిది అన్నారు.
బీసీ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నాం.గవర్నర్ ఆర్డీ నేన్స్ కోసం ఇప్పటికే పంపించాం.
బీసీ రిజర్వేషన్ ఆధారంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తాం.కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన ఆరు పథకాల హామీలో భాగంగా
ఇల్లు లేని వారికి ఇంద్రమ్మ ఇల్లు నియోజకవర్గానికి 3,500 మంజూరు చేశాము.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా ద్వారా రాష్ట్రంలో 51 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి.
రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద 93 లక్షల కుటుంబాలకు రూ.10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం అందుబాటులో ఉంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular