నిజామాబాద్ జులై 30 ద్రోణ
తెలంగాణ విద్యార్థి పరిషత్ నిజామాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విద్యార్థి పరిషత్ 13వ ఆవిర్భావ దినోత్స వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు బొబ్బిలి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ తెలంగాణ విద్యార్థి పరిషత్ 2012 జూలై 30న ఉద్యమాల అడ్డ ఉస్మానియా యూనివర్సిటీ లో ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ విద్యార్థుల ఆశయాలను నిలబెట్టింది ఆంధ్ర పాలకుల మెడలు వంచి నీళ్ళు నిధులు నియామకాలు తెలంగాణ కోసం ఏర్పాటు చేయాలని ప్రత్యేకత తెలంగాణ అభివృద్ధి దేయంగా నాలుగు కోట్ల మంది ఆశయాలకు ఆసరాగా తెలంగాణ విద్యార్థి పరిషత్ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. నాటినుండి నేటి వరకు విద్యార్థుల సమస్యలపై తిరుగులేని పోరాటం చేస్తుందన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ నాటి నుంచి నేటి వరకు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేసిన దాఖలాలు లేవన్నారు.
పోరాడిన ప్రతి విద్యార్థి సమస్య – ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్షిప్ జాప్యం, కాలేజీల్లో అవకతవకలు, నకిలీ కాలేజీలు, నిరుద్యోగ సమస్యలు ఇవన్నింటిపై గళం విప్పి, కార్యాచరణ చేపట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు.
పోరాడిన ప్రతి విద్యార్థి , నకిలీ కాలేజీలు, నిరుద్యోగ సమస్యల పై టీజీవీపీ అనునిత్యం విద్యార్థుల కోసం పోరాటం చేస్తూనే ఉంటుంది అన్నారు. ఈ కార్యక్రమం లో బోధన్ డివిజన్ అధ్యక్షుడు నగేష్ జిల్లా కార్యదర్శి వినయ్
కార్యకర్తలకు సుజిత్ , నిఖిల్, అఖిల్ ధర్మేందర్ మహేష్ ,సిద్దూ సర్వేష్ తదితలు పాల్గొన్నారు.



