బోధన్ జులై 30 ద్రోణ
ప్రజా సమస్యలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని, తన నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన జరిపి తన దృష్టికి తీసుకురావాలని అధికార యంత్రాంగానికి మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
బాన్సువాడ నియోజకవర్గం చందూర్, మోస్రా మండల కేంద్రాలలో వచ్చే నెల ఆగస్టు 4వ తేదీన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి , రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి అనసూయ సీతక్క పర్యటించనున్నారని పోచారం స్పష్టం చేశారు. అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం కానున్న చందూర్, మోస్రా మండల సముదాయ భవనాలు, మోస్రా లో జనరల్ ఫంక్షన్ హాల్, చందూర్ గ్రామపంచాయతీ భవనం ప్రారంభోత్సవ ఏర్పాట్లపై సంబంధిత అధికారులు, నాయకులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు సాయి రెడ్డి, అంబర్ సింగ్, నా రోజు గంగారం, సురేష్ బాబా, పోచారం సురేందర్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ సాయిలు, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.







