Thursday, February 12, 2026

కోటగిరిలో చిన్నారులకు లయన్ అన్నదానం

కోటగిరి జులై 30 ద్రోణ

కోటగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
లయన్ బాబురావు జన్మదిన సందర్భంగా కోటగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అమ్మానాన్న అనాధాశ్రమంలో సేవా కార్యక్రమాలను నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ లయన్ బాబురావు సేవలు ఎంతో అమోఘమని వారి సేవలు చిరస్థాయిగా నిలుస్తాయన్నారు. వారి జన్మదిన సందర్భంగా తమ క్లబ్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టామని భవిష్యత్తులో మరెన్నో చేపడతామని స్పష్టం చేశారు. వారి ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు సమాజంలో సేవా కార్యక్రమాలను చేపట్టాలన్నారు. వారు చేస్తున్న సమాజసేవ ప్రజలకు అవగాహన కల్పించడం కోసమే వారి జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి హనుమంతరావు సెక్రటరీ శివ, శ్రీనివాస్, బర్ల సాయిలు, కోటగిరి రెండో అధ్యక్షులు కూచి సిద్దు, గురునాథ్, అనిల్, కొల్లూర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular