బోధన్ జులై 31 ద్రోణ
సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని విషయాన్ని ప్రజలు గుర్తించాలని, భక్తి మార్గంతోనే ముక్తి కలుగుతుందని, ప్రతి ఒక్కరు భక్తిశ్రద్ధలతో జీవితాన్ని కొనసాగించాలని ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.బాన్సువాడ మండలం బోర్లం గ్రామ శివారులో గల స్వయం భూ శ్రీఆదిబసవేశ్వర స్వామి వారిని దర్శించుకుని, వేద పండితులు ప్రత్యేక పూజలు జరిపి పోచారానికి ఆశీర్వదించారు. అనంతరం ఆలయానికి శ్రీశ్రీశ్రీ జగద్గురు డా.చంద్రశేఖర శివాచార్య మహస్వామి జీ ఆశీర్వాదం పొందారు.పాల్గొన్న మండల ప్రజాప్రతినిధులు, వేదపండితులు,గ్రామ ప్రజలు, అశేష భక్తజనం హాజరయ్యారు.








