షబ్బీర్ ఆలీ కి ఘన సన్మానం
కామారెడ్డి జూలై 31 ద్రోణ
కామారెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని, మాచారెడ్డి మండలంలోని ప్రతిల్లు తన కుటుంబం లాంటిదని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు.ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి మాచారెడ్డి గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు.
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి
కొత్త రేషన్ కార్డులు ,రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు,2లక్షల రుణమాఫీ, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత కరెంటు, ఉచిత బస్సు, డాక్రా మహిళలకు రుణాలు, అందిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
అదే కాకుండా మాచారెడ్డి గడ్డమీద పుట్టిన ముద్దుబిడ్డ షబ్బీర్అలీ తన పుట్టిన భూమి మాచారెడ్డి గ్రామాన్ని అభివృద్ధి చేసి కామారెడ్డి జిల్లాలోని మొదటి స్థానంలో ఉంచాలని కోరారు.
మా ప్రాణం ఉన్నంతవరకు మీకు అండగా నిలుస్తామని ముక్తకంఠంతో తెలిపారు.
ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ తప్పకుండా మాచారెడ్డి మండలాన్ని అభివృద్ధి చేస్తానని హామీ షబ్బీర్ అలీ హామీ ఇచ్చారు.
మీరు చూపించిన ప్రేమ అభిమానాలతో నేను జాతీయస్థాయ నాయకునిగా ఎదిగానని అన్నారు.
మాచారెడ్డి గ్రామంలోని ప్రతి కుటుంబం నా కుటుంబం లాంటిది గ్రామంలోని ప్రతి కుటుంబం అభివృద్ధి
చెందేలా చూస్తానన్నారు.
నియోజకవర్గం కూడా అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.
స్థానిక ఎన్నికల్లో మీరందరూ ఏకతాటిపై ఉండి కాంగ్రెస్ పార్టీకి సహకరించాలని కోరారు.తెలంగాణ రాష్ట్రాన్ని బిఆర్ఎస్ అప్పుల కుప్పగా మార్చిన పేదల కోసం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరియు ఇందిరా గాంధీ ఆశయాలను పథకాల ద్వారా అమలు చేస్తున్నాం అని షబ్బీర్ ఆలీ అన్నారు.
గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు ఎవరు ఉండకుండా ప్రత్యేక సర్వే చేయించి ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు అందేల చేస్తాను. అర్హులైన కుటుంబాలన్నిటికీ రేషన్ కార్డులు అందిస్తాను అన్నారు.











