Thursday, February 12, 2026

ప్రజల సంరక్షణ పోలీసుల బాధ్యత

హైదరాబాద్ జూలై 31 ద్రోణ

ప్రజలకు సంరక్షణ కల్పించడం పోలీసులు ద్యేయంగా పనిచేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.ములుగు పోలీస్ ఆధ్వర్యంలో నిర్మించిన క్రికెట్ స్టేడియం ను మంత్రి సీతక్క ప్రారంభించారు. గురువారం ములుగు జిల్లా లోని జకారం పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ సంకల్పం తో నూతనంగా నిర్మించిన పోలీస్ క్రికెట్ స్టేడియం ను లాంచనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోలీస్ శాఖ లో పనిచేస్తున్న పోలీసు లకు ఫిజికల్ ఫిట్నెస్ తప్పనిసరి అని క్రీడలు పోలీసుల్లో ఉత్తేజాన్ని నింపుతాయని ప్రజల సంరక్షణ పోలీసుల ప్రథమ కర్తవ్యం అని దీంతో పాటుగా పోలీసుల ఆరోగ్యం కూడా అంతే ముఖ్యమని మంత్రి సీతక్క అన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వెంట జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవి చందర్, తో పాటు పోలీస్ ఉన్నతాధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular