రుద్రూర్ ఆగస్టు 8 ద్రోణ
రుద్రూర్ మండల కేంద్రంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు మనసున్న మహానేత సురేష్ కుమార్ శెట్కార్ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. బాన్సువాడ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను పండుగ వాతావరణం లో జరుపుకున్నారు . అంగన్వాడీ కేంద్రాల్లో 8 సెంటర్లకు రెండు ఫ్లోర్ మ్యాట్ల చొప్పున మరియు స్నాక్స్ ని పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పోతురాజు లింగం, షేక్ నిసార్, వడ్ల నరేష్, గాండ్ల శ్రీనివాస్, రఫీక్ డాక్టర్, శివ శ్రీకాంత్ గౌడ్ మరియు తదితరులు పాల్గొన్నారు.














