ఇందూర్ చంద్రశేఖర్ కు ప్రశంసల వెల్లువ
రుద్రూర్ ఆగస్టు 15 ద్రోణ
ఆపదలో ఉన్నవారిని ఆదుకుంటూ తన ఉదారతను వ్యక్తం చేస్తూ పేదలకు సామాజిక సేవలు అందించడమే తన లక్ష్యంగా భావిస్తూ ముందుకు వెళుతున్న రుద్రూర్ తాజా మాజీ సర్పంచ్ చంద్రశేఖర్. రాజకీయాల్లో సైతం ఆయన ప్రత్యేక పందాలు ప్రయాణం చేస్తూ ఉంటారు. తనదైన ప్రత్యేక ముద్రను వేసుకున్నారు.రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇబ్బందులు పడుతున్న పేదలను పలకరిస్తూ తన వంతు సహాయ సహకారాలను శుక్రవారం ఆయన అందించారు. రెండు పర్యాయాలు రుద్రూర్ గ్రామ సర్పంచిగా ప్రజలు దీవెనలు అందించారు. పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో లేనప్పటికీ రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలబడి గెలుపొందారు. ఎంతోమంది రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన అనంతరం అధికార పార్టీలో చేరడం పరిపాటిగా మారింది. అయినప్పటికీ ఇందూర్ చంద్రశేఖర్ ఏనాడు ఇతర పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఇతర పార్టీలతో సైతం ఏనాడు వైరం తో ఉండరు. గ్రామాభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తూ ఉంటారు. అధికారంలో తమ పార్టీ లేకపోయినప్పటికీ తన గ్రామంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు, వచ్చిన సందర్భాల్లో సైతం సాదరంగా ఆహ్వానిస్తూ ఉంటారు. అలా అని ఏనాడు ఇతర పార్టీ నాయకులతో చట్ట పట్టాలు వేసుకుని తిరిగేవారు కారు. పదేళ్లపాటు అధికారంలో లేకపోయినా తాను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ జెండా చేతపట్టి రాజకీయంగా ముందుకు సాగారు. మొన్నటి శాసనసభ ఎన్నికల సందర్భంలో సైతం కాంగ్రెస్ అధిష్టానము పిలిపించింది. బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించడంలో అధిష్టానం మల్ల గుల్లాలు పడ్డది. అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో బాన్సువాడ శాసనసభ టికెట్ ఇచ్చేందుకు కూడా ఢిల్లీ అధిష్టానం ఆలోచన చేసింది. అధిష్టానం ఆదేశిస్తే తాను పోటీకి సిద్ధమని అధిష్టానం కు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. టికెట్ ఆశించినప్పటికీ టికెట్ రాలేదని ఆలోచన చేయకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థినీ గెలిపించేందుకు తన వంతు ప్రయత్నాలు చేశారు. స్థానిక ఎన్నికలు వచ్చే నెలలో ప్రభుత్వం ఇప్పటికే నిర్వహించేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు చేశారు. కాంగ్రెస్ పార్టీ పట్ల అంకితభావంతో పనిచేసే కార్యకర్తలకే పదవులు కట్టబెడతామని, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నటరాజన్ ఇప్పటికే స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఇందూర్ చంద్రశేఖర్ కు మరో మంచి అవకాశము వచ్చే అవకాశాలు నిండుగా కనిపిస్తున్నాయి.
సామాజిక సేవే తన లక్ష్యం
రుద్రూర్ మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇందూర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గ్రామంలో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు ఎరుకల గల్లి మరియు బోయవాడల యందు నీట మునిగిన గృహాలను సందర్శించి వారికి నిత్యవసర సరుకులను, బింగి సుజాత గంగారాం లకు మరియు పెంట గంగామణి, లింగమని, పెంట అనుజ, బెంగి ఎల్లవ కు *ఆర్ధిక సహాయం అందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు *షేక్ నిసార్, ఇందూర్ కార్తీక్* మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.






