ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.
హైదరాబాద్ ప్రతినిధి సెప్టెంబర్ 21 ద్రోణ
మాదిగ సంఘం చింతకమడక గ్రామ అధ్యక్షుడు జింక స్వామి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు చిన్నరాం ముత్యం నివాసాలలో బతుకమ్మ పేర్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత .రామాలయంలో ప్రత్యేక పూజలు.. హైస్కూల్ గ్రౌండ్ లో గ్రామస్తులతో కలిసి ఎంగిలి పూల బతుకమ్మ ఆడిన కవిత.
తనను కుటుంబానికి దూరం చేసిన వారి భరతం పడతానని కవిత హెచ్చరించారు.
చంద్రుడి లాంటి కేసీఆర్ కు మచ్చ తెచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.భవిష్యత్ లో సొంతూరే కర్మ భూమి కావచ్చని ఆమె వ్యాఖ్యానించారు.
సిద్దిపేట, చింతమడక తమ జాగీరుగా భావించే వాళ్లకు బుద్దిచెప్తామన్న కవిత.
ఎంత ఎక్కువ ఆంక్షలు పెడితే అన్ని ఎక్కువ సార్లు వస్తాను.
చింతమడక గ్రామమంటే చరిత్ర సృష్టించిన గ్రామం.
చింతమడక ముద్దుబిడ్డ కేసీఆర్ ఎవ్వరు మాట్లాడకముందే తెలంగాణ కోసం కంకణబద్దులయ్యారు.
మొత్తం రాష్ట్రమంతా తిరిగి అందరినీ మేల్కొలిపి తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయారు.
ఆయన ముందడుగు వేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది.
చింతమడక మట్టి నుంచి ఒక ఉద్యమం పుట్టింది. అదే దేశ, రాష్ట్ర చరిత్రను మార్చింది.
అదే చింతమడకలో బతుకమ్మ ఆడేందుకు నన్నుఆహ్వానించటం సంతోషంగా ఉంది.
చాలా ఏళ్లుగా నేను చింతమడకకు రాలేదు.
గతేడాది ఒక రకమైన బాధాకార పరిస్థితులుండే. ఈ ఏడాది కూడా ప్రత్యేక పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో నన్ను అక్కున చేర్చుకొని రమ్మన్నందుకు సంతోషంగా ఉంది. సొంత ఊరంటే చాలా మందికి ప్రేమ ఉంటుంది. చింతమడకలో చాలా జ్ఞాపకాలు ఉన్నాయి.
కులాలకు, మతాలకు అతీతంగా అన్ని పండుగలు చేసుకున్నట్లు నాకు బలంగా గుర్తుంది. చిన్నప్పుడు ఇక్కడకు వచ్చి అన్ని కులాలను కలుపుకొని బతుకమ్మ ఆడుకున్నాం.
అన్ని కులాలను కలుపుకోవాలని చింతమడక ఏదైతే నేర్పించిందో అదే ధైర్యంగా తీసుకున్నాను.
తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెలో బతుకమ్మ ఎత్తుకొని కాళ్లకు బలపం కట్టుకొని తిరిగాను. చింతమడక ఇచ్చిన ధైర్యంతోనే నేను అదంతా చేయగలిగాను. ఉద్యమం ప్రారంభమైన తర్వాత కేసీఆర్ గారు ఇక్కడ రిజైన్ చేసి ఇంకొకరిని ఇక్కడ పెట్టారు.
ఆనాటి నుంచి సిద్దిపేట, చింతమడక రావాలంటే అదేదో ప్రైవేట్ ప్రాపర్టీ, అదేదో కేజీఎఫ్ లాగా ఇక్కడ ఆంక్షలు పెట్టారు.
ఇవ్వాళ్టికి కూడా ఆ ఆంక్షలు ఉన్న సంగతి మీకు తెలిసిందే.
కానీ చింతమడక కేసీఆర్ అనే చిరుతపులిని కన్న గడ్డ.
ఇలాంటి గడ్డ మీద ఎవరీ ఆంక్షలు నై జాన్తా అని మొత్తం ఊరంతా నిరూపించింది.
ఇదే ఒరవడి కొనసాగాలని నేను ఆంకాంక్షిస్తున్నా.
మీ ఆశీర్వాదంతో కేసీఆర్ ఒకసారి భూకంపం పుట్టించి తెలంగాణ తెచ్చి మీ ముందు పెట్టారు. మరి మీరు ఆశీర్వాదంతో ఇస్తే ఇదే నా జన్మభూమి కూడా కర్మభూమి కావచ్చు. ఆనాడు ఆంధ్రోళ్లు వందల ఆంక్షలు పెట్టినా బుల్లెట్లకు ఎదురుపోయి ఉద్యమం చేసిన చరిత్ర మనకు ఉంది. ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఆగేదీ లేదు.
కచ్చితంగా చింతమడకకు, సిద్దిపేటకు మళ్లీ మళ్లీ వస్తాం.
ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ సార్లు వస్తాం. చింతమడక తలెత్తుకొనే విధంగా కేసీఆర్ తెలంగాణ తెచ్చారు.
ఆయనను ఇక్కడ చంద్రుడు అని పిలుస్తారు.
అలాంటి చంద్రునికి కొంతమంది మచ్చ తెచ్చే పని కొంతమంది చేశారు.
మచ్చ తెచ్చారని చెప్పగానే తల్లిని, పిల్లను కాకుండా పాపిన్రు. కుటుంబానికి దూరం చేశారని బాధలో ఉన్న సమయంలో మీరు నాకు అండగా నిలిచారు.
పెళ్లి అయి కుటుంబాన్ని వదిలేస్తేనే ఎంతో బాధ ఉంటది. అలాంటిది తల్లి, తండ్రి బాగుండాలని కొట్లాడే నన్ను కుటుంబానికి దూరం చేసే కుట్ర చేసిన వాళ్లను వదలిపెట్టను. ఈ చింతమడక గడ్డకు ఎంత పౌరుషం ఉందో చూపిస్తా. ఆ ప్రయాణంలో మీరు నాకు అండగా ఉండాలని కోరుతున్నా.
ఏ ఊరు కూడా ఎవరీ అయ్య జాగీరు కాదు. కానీ కొంతమంది జాగీరుగా భావిస్తున్నారు. వాళ్ల సంగతి, వాళ్ల భరతం భవిష్యత్ లో కచ్చితంగా పడతాం.
చింతమడకకు రావటం సంతోషంగా ఉంది.
ఈ ఏడాది నన్ను అక్కున చేర్చుకున్నందుకు
నాకు అనేక జ్ఞాపకాలు ఉంటాయి.
7,8,9 తరగుల వరకు బతుకమ్మ ఆడుకున్నాం.
చింతమడక మనకు అన్ని కులాలు, మతాలను
తెలంగాణ ఉద్యమంలో ప్రతి పల్లెలో కాళ్లకు బలపం కుట్టుకొని తిరిగా.
ఉద్యమం లేనప్పుడు చింతమడకకు వచ్చిన జ్ఞాపకాలు ఉన్నాయి.
చింతమడక లో
ఆనాటి నుంచి సిద్దిపేట, చింతమడక రావాలంటే కేజీఎఫ్ లాగా ఉంది.
ఆంక్షలు ఉన్నాయి.
ఈ చింతమడక గడ్డ చిరుత పులిని కన్న గడ్డ
ఇదే ఒరవడి కొనసాగాలె. ఎవర్రీ ఆంక్షలు
నా జన్మ భూమియే కర్మభూమి అయ్యే అవకాశం ఉంది.
మనం తెలంగాణోళ్లం, ఆంక్షలకు ఎదురొడ్డి తోసుకొని పోయి ,ఆంక్షలు పెడితే చింతమడకకు, సిద్దిపేటకు మళ్లీ మళ్లీ వస్తాం.
కేసీఆర్ తల ఎత్తుకొనే విధంగా రాష్ట్రం తెచ్చారు.
చంద్రం అని కేసీఆర్ ని పిలుస్తారు. మచ్చలేని చంద్రునికి మచ్చ తెచ్చారు. మచ్చ తెచ్చారని చెప్పగానే
నేను ఈ ఏడాది బాధతో ఉన్న క్లిష్టపరిస్థితుల్లో ఉన్న .
హృదయపూర్వకంగా
మీ అందరికీ తెలుసు
తండ్రి, తల్లి బాగుండాలని అనుకునే నన్ను విడగొట్టే ప్రయత్నం చేశారు.
ఏ ఊరు ఎవ్వరీ అయ్యా జాగీరు కాదు. వాళ్ల భరతం కూడా భవిష్యత్ లో పడతాం.










