Wednesday, February 11, 2026

రౌడీకి, లేడీకి మధ్య జరుగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఉన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయం

బీఆర్ఎస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీకి పక్షపాతంగా పనిచేస్తున్న సీపీ సజ్జనార్,

ఏసీపీ, డీసీపీ, సీఐ రమేష్ నాయక్ లను బదిలీ చేయాలి..

ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసిన జీవన్ రెడ్డి

ముస్లింలపై పోలీసుల దౌర్జన్యం

ఏ గల్లీకి వెళ్లినా ప్రజలంతా..

కావాలి కేసీఆర్-రావాలి కేసీఆర్-

గెలవాలి కేసీఆర్ కావాలంటూ

బీజేపీ పార్టీలది ఫెవికాల్ బంధం

నిజామాబాద్ ప్రతినిధి ద్రోణ:-

తెలంగాణ భవన్ లో జరిగిన పత్రికా సమావేశంలో పాల్గొన్న జీవన్ రెడ్డి, కాంగ్రెస్ బీజేపీ లు ఢిల్లీలో ఫైట్ చేస్తున్నట్లు నటిస్తూ, గల్లీలో మాత్రం మిలాఖత్ అవుతున్నాయని విమర్శించారు.

ముస్లింలపై పోలీసుల దౌర్జన్యం…..

జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో పోలీసులు ఒక ముస్లిం కుటుంబం ఇంటికి వెళ్లి, చిన్న పిల్లలు ఏడుస్తున్నా కూడా దౌర్జన్యంగా వ్యవహరించారన్న మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేక పోలీసు రాజ్యం ఉందా..? అని ప్రశ్నించారు. మైనారిటీలను కాంగ్రెస్ పార్టీ అవమానిస్తోందని, కాంగ్రెస్ కు ఓటు వెయ్యకపోతే పథకాలు ఆపేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి ముస్లింలను బెదిరిస్తున్నాడని జీవన్ రెడ్డి విమర్శించారు.

అసెంబ్లీ ఎన్నికల్లో అజారుద్దీన్ పోటీ చేసినప్పుడు, ఎంఐఎం పార్టీ అభ్యర్థిని బరిలోకి దింపింది. మరి ఉప ఎన్నికల్లో ఎందుకు అభ్యర్థిని నిలబెట్టలేదని ఎంఐఎం పార్టీని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. మరోవైపు ఉప ఎన్నికల్లో ప్రచారం చేయాలని కాంగ్రెస్ నేత ఫహీం ఖురేషీ , ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీని కోరితే, ఓవైసీ తిరస్కరించారని జీవన్ రెడ్డి వెల్లడించారు.

రిగ్గింగ్ కు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్…..

ఇక్కడున్న ఏసీపీ, డీసీపీ, సీఐ అంతా డీజీపీ శివధర్ రెడ్డి, సీపీ సజ్జనార్ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, దీంతో ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని జీవన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. “రిగ్గింగ్ చేసే ముఠాలు షేక్ పేట్ లోని ఫంక్షన్ హాల్ లో ఉంటున్నారు. కాబట్టి, రిగ్గింగ్ ను అరికట్టేందుకు కేంద్ర పారామిలిటరీ బలగాలతో భద్రత ఏర్పాటు చేయాలని” జీవన్ రెడ్డి కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. సీఐ రమేష్ నాయక్ నుండి సీపీ సజ్జనార్ వరకు, పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసులను బదిలీ చేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ కు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇప్పటికే ఫిర్యాదు చేసిందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఖాకీ బుక్కుల ఉంటాయన్న డీజీపీ శివధర్ రెడ్డి.. పింక్ బుక్కుల్లో మీ అందరి పేర్లు ఎక్కిస్తున్నామని సీనియర్ నేత జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.

రావాలి కేసీఆర్- కావాలి కేసీఆర్…..

జూబ్లిహిల్స్ లో ఏ గల్లీకి వెళ్లినా ప్రజలంతా కావాలి కేసీఆర్-రావాలి కేసీఆర్- గెలవాలి కేసీఆర్ అంటున్నారన్న జీవన్ రెడ్డి… మోకా ఇచ్చిన కేసీఆర్, దోకా చేసిన రేవంత్ రెడ్డి మధ్య జరుగుతున్న జూబ్లిహిల్స్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలు అభివృద్ధికి, అరాచకానికి మధ్య జరుగుతున్న ఎన్నికలన్నారు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. కాంగ్రెస్ బీజేపీ పార్టీలది ఫెవికాల్ బంధమని జీవన్ రెడ్డి విమర్శించారు.

ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసుధనాచారి, మాజీ ఎమ్మెల్యే షకీల్, ముస్లిం నేతలు సల్మాన్ ఖాన్ , ఇతర నేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular