Wednesday, February 11, 2026

సర్పంచ్ గా కాదు సేవకుడిగా ఐదేళ్లపాటు పనిచేస్తా

ఈ గ్రామానికి నేను ఒక్కడినే సర్పంచిగా భావించనవసరం లేదు. నన్ను ఎన్నుకున్న ప్రజలందరూ సర్పంచ్లు గానే నేను భావిస్తూ కుల మతాలకు అతీతంగా అందర్నీ సమానత్వంతో గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించడమే తన లక్ష్యంగా భావిస్తాను. ఈరోజు నుండి గ్రామస్థులందరి సహాయ సహకారాలు మా పాలకవర్గానికి ఎంతో అవసరం. ఇప్పటివరకు ప్రజల సహకారంతో తన వంతు కృషి చేశాను. ఇకముందు కూడా మీ అందరి అండదండలు నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. రాబోయే రోజుల్లో మన నూతన గ్రామపంచాయతీ నీ అభివృద్ధి పరచి మండలంలో ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించే ప్రయత్నం చేసుకుందాం. మన గ్రామానికి చెందిన ఎంతోమంది దూర ప్రాంతాల్లో నివాసం ఉంటూ మన గ్రామం పై ఓ ప్రత్యేక శ్రద్ధ చూపడం ఎంతో అభినందనీయం. దూరపు ప్రాంతాల్లో ఉన్నవారు ఎన్నికల రోజు వచ్చి ఓట్లు వేసి తనను గెలిపించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు. తాను గ్రామానికి సర్పంచ్ గా కాదు సేవకుడిగా ఐదేళ్లపాటు పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నాను. ఐకమత్యమే మన బలం. ప్రమాణ స్వీకార మహోత్సవానికి గ్రామస్థులు బాధ్యతగా భావించి హాజరై తమకు సూచనలు సలహాలు అందిస్తే గ్రామాన్ని అభివృద్ధి బాటలో తీర్చిదిద్దేకు మార్గం చూపిన మార్గదర్శకులుగా నిలిచిపోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular