ద్రోణ, పోతంగల్, జనవరి 23
పోతంగల్ మండల కేంద్రంలోని చెరువు గట్టుపై గంగమ్మ ఆలయ నిర్మాణ పనులను శుక్రవారం సర్పంచ్ కల్లూరు సంధ్య హనుమాన్లు ప్రారంభించారు. ఆలయ నిర్మాణానికి ఎస్డిఎఫ్ నిధుల కింద 5 లక్షలు మంజూరయ్యాయి. ఈ నిధులతో ఆలయ నిర్మాణం చేపట్టనున్నట్లు సర్పంచ్ సంధ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంధపు రాజు, బజరంగ్ హనుమాన్లు , గంధపు హనుమాన్లు కేశ వీరేశం సూదం ధనరాజ్ ఉప సర్పంచ్ నబి, ఫుల్ కంటి సాయిలు శివ పోశెట్టితదితరులు పాల్గొన్నారు.

