నిజామాబాద్ ఆగస్టు 20 ద్రోణ
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట వద్ద గల పోలీస్ ఫైరింగ్ కేంద్రంలో సిపి సాయి చైతన్య ఆధ్వర్యంలో జిల్లా పోలీసు సిబ్బందికి ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. పోలీసు సిబ్బంది విధుల్లో భాగంగా వినియోగించే ఆయుధాలపై పూర్తి అవగాహన కలిగి ఉండేలా , ఆయుధాలను సురక్షితంగా మరియు సమర్థవంతంగా వినియోగించే విధంగా ప్రాక్టికల్ శిక్షణ అందించారు. సిబ్బంది నిర్ణీత లక్ష్యాలపై ఫైరింగ్ నిర్వహిస్తూ లక్ష్యసాధన , ఖచ్చితత్వం , ఏకాగ్రత , ఆయుధాల వినియోగ నైపుణ్యాలను మెరుగు పరచాలన్నారు. అత్యవసర పరిస్థితులు నేరస్తులపై చర్యలు , శాంతిభద్రతల పరిరక్షణ వంటి సందర్భాల్లో పోలీసులు తక్షణమే స్పందించాల్సి ఉంటుందని , అందుకు నిరంతర ఫైరింగ్ ప్రాక్టీస్ ఎంతో అవసరమని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. ఆయుధాలను వినియోగించే సమయంలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని , క్రమశిక్షణతో వ్యవహరించాలని సిబ్బందికి సూచించారు.పోలీసు సిబ్బంది ప్రతి ఒక్కరు తమ ఫైరింగ్ నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకుని , విధి నిర్వహణలో మరింత సమర్థవంతంగా పనిచేసేలా సిద్ధంగా ఉండాలని పోలీస్ కమిషనర్ ఆదేశించారు.
ఈ సందర్భంగా అదనపు డీసీపీ (అడ్మిన్) ఎన్. శుభం ప్రకాష్ , నిజామాబాద్ , ఆర్మూర్ , బోధన్ , టాస్క్ ఫోర్స్ , సిటిసి , ట్రాఫిక్ , ఏ.ఆర్ , హోంగార్డ్స్ , ఐ.టి ఏసిపిలు , సిఐలు , ఎస్హెచ్ఓలు , పి.ఎస్.ఓ లు తదితరులు పాల్గొన్నారు.

